పి.ఎం.జి.కే.ఏ.వై కింద
ఏ మేరకు సబ్సిడీ బియ్యాన్ని కేటాయించారు?
పార్లమెంట్లో అడిగిన నెల్లూరు ఎంపీ ఆదాల
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పి.ఎం.జి.కె.ఏ.వై) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాది జూలై -నవంబర్ నెలల్లో ఏ మేరకు సబ్సిడీ బియ్యాన్ని కేటాయించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం లోక్ సభలో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత కింద కేటాయించిన మొత్తం కోటా ఎంత అని కూడా అడిగారు. దీనికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాత పూర్వకంగా సమాధానం చెబుతూ 198.78 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఈ ఏడాది జులై -నవంబర్ నెలలకు ఈ కోటా కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జులై- నవంబర్ నెలలకు ఆంధ్రప్రదేశ్ కు
6,70,552.58
మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించగా 2,466.909 కోట్ల రూపాయల సబ్సిడీ లభించినట్లు తెలిపారు. అలాగే మే- జూన్ నెలల్లో 268223.23 మెట్రిక్ టన్నులు కేటాయించామన్నారు. ఇందుకుగానూ కేంద్ర ప్రభుత్వం 986.77 కోట్ల రూపాయల సబ్సిడీని అం
దించిందని తెలిపారు.
Post a Comment