కాకాణి ఎదుగుదలను అడ్డుకోవడం సోమిరెడ్డి తరం కాదు"
తేది:11-08-2021
వెంకటాచలం మండల వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యస్.సి.సెల్ ఉపాధ్యక్షులు మరియు ఇస్క పాళెం గ్రామ సర్పంచ్ అడపాల ఏడుకొండలు, కసుమూరు గ్రామ సర్పంచ్ కడివేటి శివ, వెంకటాచలం మండల యస్.సి.సెల్ అధ్యక్షులు మందా కృష్ణ, మండల యస్.సి.సెల్ ఉపాధ్యక్షులు కందుకూరు సుబ్బారాయుడు, జిల్లా యస్.సి.సెల్ నాయకులు ఆస్తోటి శివకుమార్,తదితరులు.
సోమిరెడ్డి లోపాయికారీతనంగా వ్యవహరిస్తూ, మా నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నాడు.
సోమిరెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, తెలుగుదేశం పార్టీ నాశనం అవ్వడం
తప్ప, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడం గానీ, మా నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఎదుగుదలను అడ్డుకోవడం సోమిరెడ్డి వల్ల కాదు, సోమిరెడ్డి తాతాలు దిగివచ్చిన సాధ్యపడదు.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 సోమిరెడ్డి లోపాయికారితనంగా వ్యవహరిస్తూ, కొందరితో కలిసి కుమ్మక్కై, మా నాయకుడు "కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాడు".
👉 రాష్ట్ర నాయకుడినని చెప్పుకునే సోమిరెడ్డి, జిల్లాస్థాయికి కూడా పనికిరాకుండా సర్వేపల్లి నియోజకవర్గానికి పరిమితమవుతూ, చివరికి నియోజకవర్గ స్థాయి నుండి వెంకటాచలం "మండల స్థాయికి దిగజారి పోయాడు".
👉 జిల్లాలోని ప్రజలందరికీ సోమిరెడ్డి లక్ష్యం, సోమిరెడ్డి పన్నుతున్న కుట్రలు, తెలిసి చివరకు "సొంత పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారు".
👉 కంటేపల్లికి సోమిరెడ్డిని ఆహ్వానిస్తే కలెక్టరేట్ కు "పారిపోయాడు".
👉 సోమిరెడ్డి ఆరోపణలు చేయడం తప్ప, వాస్తవాలు తెలుసుకునేందుకు రావడం లేదు.
👉 సోమిరెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండడం వల్ల, వస్తే నిజాలు బయటపడతాయని ముఖం చాటేస్తున్నాడు.
👉 దళితుల పట్ల సోమిరెడ్డికి ఎంత ప్రేమ ఉందో నియోజకవర్గంలోని దళితులు అందరికీ తెలుసు.
👉 సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దళితులమైన మేము సర్పంచులుగా ఉంటే, తీవ్రంగా అవమానించాడు.
👉 దళిత సర్పంచులు మాట్లాడుతుంటే మైకులు లాక్కోవడం, దళితులను, దళిత ప్రజాప్రతినిధులను అసభ్యకర పదజాలంతో దూషణలకు దిగిన "దళిత ద్రోహి" సోమిరెడ్డి.
👉 కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు దళితులమైన మాకు, ఆయనతో సమానంగా కూర్చొని, చనువుగా మాట్లాడే స్వేచ్ఛ, స్వతంత్రం మాకు కల్పించారు.
👉 దళితులు ఏదైనా మాట్లాడబోతే "ఏయ్..మూసుకో" అని కసురుకునే సోమిరెడ్డికి, దళితుల పట్ల ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో!.
👉 అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కనపడని దళితులు అధికారం కోల్పోయాక అక్కరకు వచ్చారా!.
👉 దళితుల పట్ల నిర్లక్ష్యంగా, నిరంకుశంగా వ్యవహరించిన "దళిత ద్రోహి" సోమిరెడ్డిని దళిత జాతి ఎన్నటికీ క్షమించదు.
👉సర్వేపల్లి నియోజకవర్గంలో రాబోవు 2024 ఎన్నికల్లో సోమిరెడ్డికి, దళితుల తడాఖా ఏంటో!, మరోసారి చూపిస్తాం.
Post a Comment