సర్వేపల్లి రిజర్వాయర్ లో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారం ఇరిగేషన్ నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఈఈ కృష్ణమోహన్ దోపిడీకి పరాకాష్ట..
మైనింగ్ సీనరేజీ చెల్లించకుండా, ఆ శాఖ అనుమతులు లేకుండా రిజర్వాయర్ లో తవ్వకాలకు ఎలా అనుమతించారు..
ఉదయం దరఖాస్తు చేస్తే సాయంత్రానికి యుద్ధప్రాతిపదికన అనుమతులు ఇవ్వడంలో లోగుట్టు ఏంటి...
ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇచ్చామంటోంది..మైనింగ్ శాఖ ఇవ్వలేదంటోంది...పేర్లు బినామీనే...ఆర్డర్లూ బినామీనే..
టీడీపీ నాయకులు మాట్లాడింది తప్పు అయితే ఎం.శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి కొడుకు, మాగుంట ఆగ్రో ఫార్మ్ ప్రైవేటు లిమిటెడ్, నెల్లూరు మాగుంట లేఅవుట్ అడ్రెస్ లో ఎవరున్నారో...ఈఈ క్రిష్ణమోహనే పట్టుకురావాలి.....
జిల్లాలో ఇరిగేషన్ శాఖ ఈఈ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకాలు, దోపిడీ, అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి లేదా..
లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు సంగతి తర్వాత చూద్దురు కానీ..ముందు సొంత జిల్లాలో ఇరిగేషన్ అధికారుల అవినీతి సంగతి తేల్చండి....
నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
బీద రవిచంద్ర...
సర్వేపల్లి రిజర్వాయర్ లో కొన్ని నెలలుగా విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వేశారు..ఓ వైపు ప్రతిపక్షం ఫిర్యాదులు చేసినా, మరోవైపు మీడియా కథనాలు రాసినా ఆగలేదు..
ఈ అక్రమ మైనింగ్ కు సంబంధించి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరుతో అనుమతులు తీసుకున్నారని, తిరిగి ఆయనపైనే కేసు పెట్టారని రెండు రోజుల క్రితం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంతో బయటపెట్టారు..
కాకాణి గోవర్ధన్ రెడ్డి యథావిధిగా తిట్లు తిట్టారు కానీ..అసలు విషయంపై వివరణ మాత్రం ఇవ్వలేదు..
నిన్న రాత్రి ఈఈ కృష్ణమోహన్ ఎవరికి అనుమతులు ఇచ్చింది, ఎంత ఫైన్ వేసింది, ఎంత డబ్బులు కట్టించుకున్నదంటూ...ఒక వివరణ ఇచ్చారు...తాము మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు, హోదా కనబరచలేదని చెప్పుకొచ్చారు...
మాలో ఎవరూ కూడా మాగుంట కుటుంబ కంపెనీలపై, మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై కేసులు కోరుకోలేదు..
ఎం.శ్రీనివాసరెడ్డి, తండ్రి రాఘవరెడ్డి, మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్ర్రైవేటు లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు..పేరుతో పర్మిషన్ ఇచ్చింది ఎవరు...పోలీసులకు ఫిర్యాదు చేసిందెవరు...
మైనింగ్ శాఖకు సీనరేజీ చెల్లించిన తర్వాతే తవ్వకాలు జరపాలని కృష్ణమోహన్ తాను ఇచ్చిన అనుమతుల్లో స్పష్టంగా పేర్కొన్నారు..దాని ప్రకారం ఎవరైనా మైనింగ్ శాఖకు సీనరేజీ చెల్లించారా....
ఇరిగేషన్ శాఖకు క్యూబిక్ మీటరుకు రూ.101, మైనింగ్ శాఖకు రూ.45 చెల్లించి, మైనింగ్ శాఖ అనుమతి తీసుకున్నాకే తవ్వాలని ఆర్డర్ ఇచ్చింది కృష్ణమోహనే కదా...
2021 జనవరి 1 నుంచి జూలై 14వ తేదీ వరకు సర్వేపల్లి రిజర్వాయర్ పరిధిలో ఎవరికీ అనుమతి ఇవ్వలేదని 14/7/21న ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చారు..
మైనింగ్ శాఖకు సీనరేజీ చెల్లించకుండా, ఆ శాఖ నుంచి అనుమతి పొందకుండానే రిజర్వాయరులో తవ్వకాలకు ఎలా అనుమతి ఇచ్చారు...
ఎం.శ్రీనివాసులు రెడ్డి, తండ్రి రాఘవరెడ్డి, మాగుంట ఆగ్రో ఫార్మ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ నుంచి మీకు వచ్చిన దరఖాస్తు కంపెనీ లెటర్ హెడ్ మీద వచ్చిందా...
దేశంలో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగని పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఆధార్ వివరాలు లేకుండా దరఖాస్తు చేస్తే అనుమతులు ఇచ్చారా..
ఎం.శ్రీనివాసులు రెడ్డికి, మాగుంట ఆగ్రో ఫార్మ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీతో ఏం సంబంధం..ఆయన ఆధార్ కార్డు, ఇతర వివరాలు మీ దగ్గర ఉన్నాయా..
పొలాల లెవలింగ్ అని దరఖాస్తులో స్పష్టంగా పేర్కొంటే మీరు నెల్లూరు నగరంలో ఇళ్ల స్థలాల చదును కోసమని అనుమతి ఎలా ఇచ్చారు..
ఒకే దస్తూరితో ఐదు దరఖాస్తులు వస్తే పరిశీలించాల్సిన బాధ్యత ఈఈ కృష్ణమోహన్ కి లేదా
జూన్ 21న పోలీసులకు ఫిర్యాదు చేస్తే...45 రోజులుగా ఎం.శ్రీనివాసులు రెడ్డి ఎవరో కనిపెట్టలేకపోయారా..
ఇప్పటికైనా మాగుంట కంపెనీల పేరుతో ఫోర్జరీ చేసి అక్రమ అనుమతులు తీసుకున్నది ఎవరో బయటపెట్టండి..
రాజకీయంగా వెనుక ఎలాంటి ఒత్తిడి ఉన్నప్పటికీ ఇదంతా నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఈఈ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జరిగిన దోపిడీనే..
నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలకు తవ్వకాలు ఆపేయాలి..కానీ జూన్ 20వ తేదీ రాత్రి ఈఈ రిజర్వాయర్ లోకి వెళ్లిననప్పుడు ప్రొక్లెయిన్లు, టిప్పర్లు భారీ సంఖ్యలో ఉన్నాయి..వాటిని సీజ్ చేయించాల్సింది పోయి పంపిచేసివచ్చారు..
ఫెనాల్టీలు విధించాం..డీడీలు కట్టించుకున్నాం అంటున్నారు..ఏ ప్రాతిపదికన కట్టించుకున్నారు..
సామాన్యులు తమ సొంత అవసరాల కోసం ఒక ట్రక్కు మట్టి తోలుకుంటే పోలీసులు, మైనింగ్ అధికారులు పదింతలు, పదిహేనింతల ఫెనాల్టీ విధిస్తారు కదా...ఇక్కడ మీరు ఏ విధంగా, ఎన్నింతలు ఫైన్ వేశారు..
ఆర్డర్లు ఇచ్చేది మీరే...కేసులు పెట్టేదీ మీరేనా...అసలు ఈ ఎం.శ్రీనివాసులు రెడ్డి ఎవరు..
తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడింది తప్పులు అయితే...ఎం.శ్రీనివాసులు రెడ్డి ఎవరో ఈఈ కృష్ణమోహనే సెలవివ్వాలి..
తవ్వింది 10 వేలు కాదయ్యా....లక్ష క్యూబిక్ మీటర్లు అని తెలుగుదేశం పార్టీ నాయకులు కొలతలు తీయడానికి వెళితే వారిపై అక్రమ కేసులు బనాయించారు..
లోకేష్ బాబు గురించి, చంద్రబాబు నాయుడు గురించి నిన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోటికొచ్చినట్టు మాట్లాడారు..
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఈ రాష్ట్రంలో నీళ్లున్నా పంటలు వేయలేమని దండం పెట్టిన రైతులెవరూ లేరు...
ధాన్యం తాలుకూ బకాయిలు చెల్లించమని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఇండ్రిన్ డబ్బాలు పట్టుకుని ఎవరూ తిరగలేదు...
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే రైతులు ఏనాడు క్రాఫ్ హాలిడే ప్రకటించలేదు..
వర్షాలు చాలీచాలకుండా పడినా, కొద్ది నీళ్లున్నా ఈ రాష్ట్రంలో సుభిక్షంగా పంటలు పండించిన ఘనత చంద్రబాబు నాయుడిది...
మంత్రి అనిల్ ని మేం పోలవరం, పులిచింతల ప్రాజెక్టులు, నెల్లూరు, సంగం బ్యారేజీల గురించి అడగడం లేదు.
ఒక ఇరిగేషన్ మంత్రిగా నెల్లూరు జిల్లాలో ఆయన శాఖ అధికారులు చేసే అక్రమాలు, దుర్మార్గాల గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నాం...
30 ఏళ్లుగా రాజకీయాలు, వ్యాపారాల్లో గౌరవప్రదంగా ఉన్న మాగుంట కుటుంబం కంపెనీ పేర్లు, వ్యక్తుల పేర్ల మీద మీ ఇరిగేషన్ ఈఈ క్రిష్ణమోహన్ ఇచ్చిన అనుమతులపై, ఆయన ఇచ్చిన వివరణ మీద మంత్రిగా అనిల్ కు బాధ్యత లేదా..
మేం ఏ అక్రమాలు బయటపెట్టినా నోరుపారేసుకుంటూ ఎదురుదాడి చేయడమే మీ వైఖరా..
మీ ఇరిగేషన్ ఈఈ అక్రమాలు, అవినీతి, దోపిడీని నిగ్గుతేల్చండి...ఆ బాధ్యత మీకు లేదా..
ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇచ్చామంటోంది..మైనింగ్ శాఖ అనుమతులు లేవంటోంది..పేర్లు బినామీ...ఆర్డర్లు బినామీ
ఉదయం అప్లికేషన్ పెడితే సాయంత్రానికి ఆర్డర్లు ఇచ్చారు..
యాక్సిస్ బ్యాంకులో వరుస సీరియల్ నంబర్లతో డీడీలు ఎవరో కట్టారో ఆరా తీయండి..
మీ ఇరిగేషన్ ఈఈ, మీ అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు..ముందు ఇక్కడ చక్కబెట్టండి...
లోకేష్ బాబు, ఆయన అబ్బ చంద్రబాబు సంగతి తర్వాత చూద్దురు....
సమావేశంలో పాల్గొన్న వారు..
రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్, పార్టీ కార్యాలయ కార్యదర్శి డాక్టర్ ఊరందూరు సురేంద్ర బాబు, యువత అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు, మహిళ అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, జిల్లా కార్యదర్శి కనపర్తి గంగాధర్, నెల్లూరు రూరల్ యువత అధ్యక్షులు షేక్ అమృల్లా, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు మాతంగి కృష్ణ...
Post a Comment