జీఎస్ఎల్వీ ఎఫ్13 ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు

  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 79వ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరులోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆగస్టు 12 తెల్లవారుజామున 5.43గంllలకు


జీఎస్ఎల్వీ ఎఫ్13 ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా కారణంగా దాదాపు 18 నెలలపాటు ప్రయోగాలను నిలిపివేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పీఎస్ఎల్వీ ప్రయోగం తర్వాత కరోనా విజృంభించడంతో ప్రయోగాలు ఆగిపోయాయి. ఇక ఆగస్టులో తిరిగి లాంచింగ్ కి ఏర్పాట్లు ప్రారంభించారు. కాగా జీఎస్ఎల్వీ ఎఫ్ 10 ప్రయోగం ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది. ఐదవసారి విజయవంతం చేయడానికి ఇస్త్రో శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు.

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం (ఈవోఎస్-03) అనే నూతన ఉప గ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు భూమిని పరిశీలించేందుకు సూర్యానువర్థన ధృవ కక్ష్య వరకు మాత్రమే ఉపగ్రహాలు పంపింది భారత్.. సూర్యానువర్థన ధృవ కక్ష్య భూమి నుంచి 506 నుంచి 830 కిలో మీటర్ల ఎత్తులో ఉంటుంది.

ఇక ఎప్పుడు పంపే భూ పరిశీలన ఉపగ్రహం (ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌) భూమి నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండనుంది. ఈసారి ఈవోఎస్‌-03 అనే రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ను మొట్టమొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.

ఇక దీని ప్రత్యేకతలను తెలుసుకుందాం

► శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇప్పటి వరకు 78 ప్రయోగాలు జరిగాయి.. ఇప్పుడు జరిగేది 79వ ప్రయోగం
► జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాల సిరీస్‌లో 14వ ప్రయోగం..
► దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్‌-03 రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.
► ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్‌ఫుల్‌ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపిస్తుంది. సుమారు 10 సంవత్సరాలు ఈ ఉపగ్రహం తన సేవలను అందిస్తుంది.

Dailyhunt

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget