ఈనెల 12న జిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం,శ్రీహరికోటలో సర్వం సిద్ధం

 ఈనెల 12న జిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం,శ్రీహరికోటలో సర్వం సిద్ధం

 

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి ఈ నెల 12వ తేదీనా జిఎస్ఎల్వీ - ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం జరగనుంది. షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుండి 12వ తేదీ ఉదయం 5.43 గంటలకు ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. దేశ రక్షణ వ్యవస్థ, విపత్తుల నిర్వహణకు ఉపకరించే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌–3 అనే ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా రోదసిలోకి పంపనున్నారు. 2,268 కిలోల బరువు కలిగిన ఈ రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ను (దూర పరిశీలనా ఉపగ్రహం) భూస్థిర కక్ష్యలోకి మొట్ట మొదటిసారిగా పంపిస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2 సిరీస్‌లో ఇది 14వ ప్రయోగం. 2020 జనవరి నెలలోనే ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంగా 4 సార్లు ప్రయోగం వాయిదా పడింది. ఈ ఏడాది కరోనా వల్ల ప్రయోగాలన్నీ వాయిదా పడ్డాయి. అవరోధాలన్నీ అధిగమించి ఈ నెల 12న ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ ఏడాదిలో ఇది రెండో ప్రయోగం కావడం విశేషం. 


Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget