జగన్ పాలనలో జనం బాధలు వర్ణనాతీతం
- చేజర్ల
కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సాయిబాబా గుడి వీది, దొమ్మరపాలెం ప్రాంతాలలో కోవూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు తెలుచుకోవడం జరిగింది.ఈ సందర్భంగా స్థానికులు ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా త్రాగునీరు రావడం లేదని,వీది దీపాలు వెలగడం లేదని,అదేవిధంగా అనేక సమస్యలను తెలియ చేయగా అధికారులు తో మాట్లాడి సమస్యలు పరిస్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
👉వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత జనం పడుతున్న బాధలు వర్ణనాతీతం.
👉ముఖ్యమంత్రి గారు పథకాల పేరట గోరంత ఇచ్చి, పన్నుల రూపేణా కొండంత గుంజుకుంటున్నారు
👉అడ్డు,అదుపు లేకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.గోటి చుట్టుపై రోకలి పోటు లాగా పెట్రోలు,డిజల్ ధరల పెరిగాయి.ఈ ధరలు అన్ని పెరగటం వలన పేద,మధ్య తరగతి ప్రజల నెలవారీ ఖర్చులు రెట్టింపు అయ్యాయి.
👉ఒక వైపు కరోనా వలన వచ్చిన కష్టాలు, మరోవైపు పెరిగిన ధరలు,ప్రభుత్వం పెంచిన పన్నులు వలన ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.
👉కరోనా కష్ట కాలం లో మన పొరుగు రాష్ట్రాల అయిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అనేక రకాలుగా అదుకోగా,మన రాష్ట్రం మాత్రం ఒక్క రూపాయి కూడా సహాయం చేసిన పాపాన పోలేదు.తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్ధిక సహాయం చెయ్యాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసినా ముఖ్యమంత్రి ఏ మాత్రం స్పందించలేదు.
👉గత ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులు అందరికి రూ.24 వేలు ఇస్తామని చెప్పి నేడు కేవలం మగ్గం ఉన్న వారికే ఇస్తున్నారు. చేనేత అనుబంధ వృత్తులలో ఉన్న వారికి మొండిచెయ్యి చూపారు.
👉గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రన్న భీమా పథకం కుటుంభం మొత్తానికి వర్తించేది. దురదృష్టవశాత్తుతో ఆ కుటుంబం లో ఎవరు చనిపోయిన వారికి పరిహారం ఇచ్చేవారు. నేడు వైస్సార్ భీమా అని పేరు మార్చి కుటుంబం లో ఒక్కరికే ఇస్తున్నారు దీని వలన ఆ కుటుంబంలో కుటుంభం పెద్ద తప్ప మరెవరూ చనిపోయిన వారికి పరిహారం రావడం లేదు.
👉ఈ రెండు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు,డీజల్ ధరలు పెరగడంతో పాటు,విద్యుత్ చార్జీలు,బస్సు ఛార్జీలు,రిజిస్ట్రేషన్ చార్జీలు,హౌస్ టాక్స్ లు పెంచడం తో పాటు చివరకు చెత్త పేరుతో కూడా పన్నులు వసూలు చేస్తున్నారు.
ఈ కార్యాక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నదుల రవికుమార్,SK సాధిక్,సజ్జా అశోక్,ఖలీల్,SK నజీర్,పూల రాంబాబు, గరికిపాటి అనిల్ మరియు కోవూరు వార్డు మెంబర్ ఇంటూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment