ప్రతిపక్షంలో ఉన్నపుడు చిన్న గుంతలో దిగి డ్రామాలు చేసి జిమ్మిక్కులు చేసిన నువ్వు,ఇప్పుడు ఈ రోడ్ గుంతల్లోకి వచ్చి ఈత కొట్టు శ్రీధర్ రెడ్డి - అబ్దుల్ అజీజ్

 


ప్రతిపక్షంలో ఉన్నపుడు చిన్న గుంతలో దిగి డ్రామాలు చేసి జిమ్మిక్కులు చేసిన నువ్వు,ఇప్పుడు ఈ రోడ్ గుంతల్లోకి వచ్చి ఈత కొట్టు శ్రీధర్ రెడ్డి - అబ్దుల్ అజీజ్


రోడ్ల పేరిట 20 వేల కోట్లు నిధులు బడ్జెట్ లో పెట్టీ, 200 కోట్లు కూడా రోడ్ల కోసం ఖర్చు పెట్టని ఘనత జగన్ మోహన్ రెడ్డిది - అబ్దుల్ అజీజ్


రాష్ట్ర వ్యాప్తంగా 95% శాతం పూర్తి రోడ్ లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ది - అబ్దుల్ అజీజ్


చిన్నపాటి వాహనాల కోసం వేసిన రోడ్ ల పై భారీ భారీ వాహనాల తో ఇసుక, మట్టి దోపిడీ చేసి ఈ రోడ్ లను గుంతల మయం చేశారు - అబ్దుల్ అజీజ్


రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ లు గుంతల మయం అవ్వడంతో, ప్రజలకు ఇబ్బంది కరంగా మారడం తో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి అధ్యక్షతన 7 నియోజకవర్గాల నాయకులతో, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులతో రూరల్ మండలం లో గల సజ్జాపురం రోడ్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు...


ఈ సంద్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...


రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ లు అన్ని ధ్వంసం అయ్యాయని, ముఖ్యంగా నెల్లూరు లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా ఆగడాలతో రోడ్ లు దారుణంగా తయారయ్యాయని అన్నారు...


ఈ రోడ్ ల మీద ప్రయాణం చేస్తూ,  మాతో పాటు ఇక్కడ ఉన్న నాయకులకు ఇద్దరికి గాయాలయ్యాయని, అంతే కాక కుటుంబ సమేతంగా వెళ్తూ ఈ రోడ్ ల పై గాయాల పాలైన సంఘటనలు కూడా చాలా ఉన్నాయని అన్నారు...


మేము ఇక్కడికి వస్తునామన్న సమాచారంతో, రాత్రి కి రాత్రి ఎర్ర మట్టి తోలారని, తోలిన వారు వాటిని సద్రం కూడా చేయలేదని ఎందుకంటే అది కూడా బెదిరించి వేయించి ఉంటారని అన్నారు..


ఇక్కడ రాత్రి పూట లైట్లు కూడా ఉండవని, గుంతలు కనిపించక ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు...


వర్షా కాలం వచ్చేటప్పుడు, పార్ట్ హోల్స్ చేయడం నిరంతర ప్రక్రియ అని, పార్ట్ హోల్స్ అంటే ఎక్కడన్నా చిన్న చిన్న గుంతలు ఉంటే వాటికి మరమ్మతులు చేస్తే, రోడ్ లు ధ్వంసం అవ్వకుండా ఉంటాయని అన్నారు...


టీడీపీ హయాంలో దాదాపు 25 వేల కిలోమీటర్ల మేర రోడ్ లు చరిత్ర సృష్టించామని, ఇంకా చాలా వరకు గ్రాంట్ లు చేశామని, అలా గ్రాంట్ చేసిన రోడ్ లు వేసే దిక్కు లేదు..


పార్ట్ హోల్స్ చేయడానికి కూడా ఏ కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితి ఈ ప్రభుత్వం లో ఉంది, అభివృధి చేయాల్సిన నిధులు కూడా దారి మల్లు తుండడంతో కాంట్రాక్టర్ లు కూడా ముందుకు రాని పరిస్థితి అన్నారు...


గతం లో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రతిపక్షం లో ఉన్నప్పుడు చిన్న గుంత లో దిగి డ్రామాలు చేశారని, ఇప్పుడు ఈ గుంతలో వచ్చి ఈత కొట్టండి మీ ముఖ్యమంత్రి రోడ్డు వేస్తారేమో చూద్దాం అని అన్నారు..


త్వరితగతిన ఈ రోడ్లన్నీ మరమ్మతులు చేసి,  తక్షణమే టిడిపి హయాంలో గ్రాంట్ లు చేసిన రోడ్లను వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు...


ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ


రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో అధ్వానంగా మారిన రోడ్లను సందర్శించామని అన్నారు..


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిమ్మిక్కులు చేసిన శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఈ గుంతల్లో జిమ్మిక్కులు చేయండి అని అన్నారు...


ఇప్పుడున్న ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు..


రాజకీయాల్లోకి వచ్చి డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అబ్దుల్ అజీజ్ మాత్రమే అని అన్నారు...


రాబోవు రోజుల్లో టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు...


ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య మాట్లాడుతూ...


నెల్లూరు రూరల్ నియోజకవర్గ రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా మారాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు...


నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోడ్ల పర్యవేక్షణ చేశామని అన్నారు....


తక్షణమే ఈ రోడ్లన్నీ మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు...


పై కార్యక్రమం లో సంపత్ యాదవ్, చెముకుల కృష్ణ చైతన్య, జాకీర్, గంగాధర్, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, భులక్ష్మీ, ప్రభాకర్ రెడ్డి, మళ్ళీ నిర్మల, ప్రణయ్ రెడ్డి, దయాకర్ గౌడ్, రేవతి, రోజా రాణి, చెన్నా రెడ్డి శ్రీకాంత్ రెడ్డి,నన్నే సాహెబ్, సుబహాన్, స్థానిక నాయకులు, గోపలయ్య, సుధీర్ నాయుడు,ఆదిత్య రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఎర్రన్న, విజయ్, సింహాద్రి, మహేష్ నాయుడు, పెంచలయ్య, మురళి, మహేష్, సుశీలమ్మ, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget