14వ డివిజన్ లో విజయవంతంగా ఆత్మీయ సమావేశం
...........................................
ఎప్పుడూ అధికారిక సమావేశాలు, సమీక్షలతో క్షణం తీరికలేకుండా ఉండే రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు పార్టీ నేతలు, అభిమానులు, ప్రముఖులతో ఆత్మీయ సమావేశం జరిపి అందరి సమస్యలు విని వాటిని పరిష్కరిస్తానని హామీఇస్తే పార్టీ కార్యకర్తలు ఎంత సంతోషిస్తారో మాటల్లో వర్ణించలేం. అలాంటి కార్యక్రమాన్ని 14వ డివిజన్ లో నిర్వహించి దానికి అధ్యక్షత వహించారు డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి. 23వ తేదీ సాయంత్రం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో బాలాజీ నగర్ లోని త్యాగరాజ స్వామి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం జరిగింది. డివిజన్ ప్రముఖులు, పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చారు. విశ్రాంత ఉద్యోగులు తమకు ఒక భవనాన్ని నిర్మించి అందులో చదువుకొనేందుకు పత్రికలు అందుబాటులో ఉంచాలని కోరగా మంత్రి గారు స్పందిస్తూ మీరే డివిజన్ లో స్థలాన్ని చూపినట్లైతే భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరికొందరు శ్రీనగర్ ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించి ఇవ్వాలని కోరగా మంత్రి గారు బదులిస్తూ దాని గురించి పరిశీలిస్తామన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నేతలు తమకు ఒక కర్మ క్రతువుల భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరగా దానికి మంత్రి అనిల్ కుమార్ గారు సమాధానం ఇస్తూ కర్మ క్రతువుల భవనాన్ని నిర్మిస్తామని, అలాగే ఒక ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవిని బ్రాహ్మణ వర్గానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఉస్మాన్ సాహెబ్ పేటలోని శివాలయం ట్రస్ట్ బోర్డులో తమకు ప్రాతినిధ్యం కల్పించడం పట్ల బ్రాహ్మణ నేతలు మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. మరి కొందరు 14వ డివిజన్ లోని పలు ప్రాంతాలలో రోడ్లు దెబ్బతిని గుంటలు మిట్టలుగా ఉన్నాయని వీటిని మరమ్మత్తులు చేయించాలని, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అందరి సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గారు హామీ ఇవ్వడం పట్ల ఆత్మీయ సమావేశానికి హాజరైన వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మీయ సమావేశానికి సమయం కేటాయించినందుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కృజ్ఞతలు తెలపడంతోపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Post a Comment