సర్పంచ్ ల శిక్షణా కార్యక్రమానికి హాజరైన డిపివో
ఆత్మకూరు పట్టణం లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి తదితరులు హాజరయ్యారు.
రోడ్ల పేరిట 20 వేల కోట్లు నిధులు బడ్జెట్ లో పెట్టీ, 200 కోట్లు కూడా రోడ్ల కోసం ఖర్చు పెట్టని ఘనత జగన్ మోహన్ రెడ్డిది - అబ్దుల్ అజీజ్
రాష్ట్ర వ్యాప్తంగా 95% శాతం పూర్తి రోడ్ లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ది - అబ్దుల్ అజీజ్
చిన్నపాటి వాహనాల కోసం వేసిన రోడ్ ల పై భారీ భారీ వాహనాల తో ఇసుక, మట్టి దోపిడీ చేసి ఈ రోడ్ లను గుంతల మయం చేశారు - అబ్దుల్ అజీజ్
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ లు గుంతల మయం అవ్వడంతో, ప్రజలకు ఇబ్బంది కరంగా మారడం తో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి అధ్యక్షతన 7 నియోజకవర్గాల నాయకులతో, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులతో రూరల్ మండలం లో గల సజ్జాపురం రోడ్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు...
ఈ సంద్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ లు అన్ని ధ్వంసం అయ్యాయని, ముఖ్యంగా నెల్లూరు లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా ఆగడాలతో రోడ్ లు దారుణంగా తయారయ్యాయని అన్నారు...
ఈ రోడ్ ల మీద ప్రయాణం చేస్తూ, మాతో పాటు ఇక్కడ ఉన్న నాయకులకు ఇద్దరికి గాయాలయ్యాయని, అంతే కాక కుటుంబ సమేతంగా వెళ్తూ ఈ రోడ్ ల పై గాయాల పాలైన సంఘటనలు కూడా చాలా ఉన్నాయని అన్నారు...
మేము ఇక్కడికి వస్తునామన్న సమాచారంతో, రాత్రి కి రాత్రి ఎర్ర మట్టి తోలారని, తోలిన వారు వాటిని సద్రం కూడా చేయలేదని ఎందుకంటే అది కూడా బెదిరించి వేయించి ఉంటారని అన్నారు..
ఇక్కడ రాత్రి పూట లైట్లు కూడా ఉండవని, గుంతలు కనిపించక ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు...
వర్షా కాలం వచ్చేటప్పుడు, పార్ట్ హోల్స్ చేయడం నిరంతర ప్రక్రియ అని, పార్ట్ హోల్స్ అంటే ఎక్కడన్నా చిన్న చిన్న గుంతలు ఉంటే వాటికి మరమ్మతులు చేస్తే, రోడ్ లు ధ్వంసం అవ్వకుండా ఉంటాయని అన్నారు...
టీడీపీ హయాంలో దాదాపు 25 వేల కిలోమీటర్ల మేర రోడ్ లు చరిత్ర సృష్టించామని, ఇంకా చాలా వరకు గ్రాంట్ లు చేశామని, అలా గ్రాంట్ చేసిన రోడ్ లు వేసే దిక్కు లేదు..
పార్ట్ హోల్స్ చేయడానికి కూడా ఏ కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితి ఈ ప్రభుత్వం లో ఉంది, అభివృధి చేయాల్సిన నిధులు కూడా దారి మల్లు తుండడంతో కాంట్రాక్టర్ లు కూడా ముందుకు రాని పరిస్థితి అన్నారు...
గతం లో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రతిపక్షం లో ఉన్నప్పుడు చిన్న గుంత లో దిగి డ్రామాలు చేశారని, ఇప్పుడు ఈ గుంతలో వచ్చి ఈత కొట్టండి మీ ముఖ్యమంత్రి రోడ్డు వేస్తారేమో చూద్దాం అని అన్నారు..
త్వరితగతిన ఈ రోడ్లన్నీ మరమ్మతులు చేసి, తక్షణమే టిడిపి హయాంలో గ్రాంట్ లు చేసిన రోడ్లను వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు...
ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో అధ్వానంగా మారిన రోడ్లను సందర్శించామని అన్నారు..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిమ్మిక్కులు చేసిన శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఈ గుంతల్లో జిమ్మిక్కులు చేయండి అని అన్నారు...
ఇప్పుడున్న ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు..
రాజకీయాల్లోకి వచ్చి డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అబ్దుల్ అజీజ్ మాత్రమే అని అన్నారు...
రాబోవు రోజుల్లో టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు...
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య మాట్లాడుతూ...
నెల్లూరు రూరల్ నియోజకవర్గ రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా మారాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు...
నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోడ్ల పర్యవేక్షణ చేశామని అన్నారు....
తక్షణమే ఈ రోడ్లన్నీ మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు...
పై కార్యక్రమం లో సంపత్ యాదవ్, చెముకుల కృష్ణ చైతన్య, జాకీర్, గంగాధర్, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, భులక్ష్మీ, ప్రభాకర్ రెడ్డి, మళ్ళీ నిర్మల, ప్రణయ్ రెడ్డి, దయాకర్ గౌడ్, రేవతి, రోజా రాణి, చెన్నా రెడ్డి శ్రీకాంత్ రెడ్డి,నన్నే సాహెబ్, సుబహాన్, స్థానిక నాయకులు, గోపలయ్య, సుధీర్ నాయుడు,ఆదిత్య రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఎర్రన్న, విజయ్, సింహాద్రి, మహేష్ నాయుడు, పెంచలయ్య, మురళి, మహేష్, సుశీలమ్మ, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు..
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, ఐ. టి. శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో కలిసి కావలి నియోజకవర్గం లో శనివారం ఉదయం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత
తేది:24-07-2021
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి గారు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.*
ఈ సందర్భంగా
తేది:24-07-2021
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులకు మరియు పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని 658 మంది మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు, పారిశుద్ధ్య కార్మికులకు 6 లక్షల రూపాయలు విలువైన నిత్యావసర సరుకుల పంపిణీ.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో కోవిడ్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులకు రేయింబవళ్లు కష్ట పడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం సంతోషకరం.
👉 కరోనా మొదటి విడతలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి 3.5 కోట్ల రూపాయల విలువైన బియ్యం, వంటనూనె పంపిణీ చేశాం.
👉 కరోనా రెండో విడత లో ప్రతి కుటుంబానికి ఆనందయ్య ఆయుర్వేద మందు అందించాం.
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా, క్రమం తప్పకుండా ఠంఛన్ గా ముందస్తు ప్రకటన ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం విశేషం.
👉 నిత్యావసర సరుకులు పంపిణీకి సహకరించిన అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం.
...........................................
ఎప్పుడూ అధికారిక సమావేశాలు, సమీక్షలతో క్షణం తీరికలేకుండా ఉండే రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు పార్టీ నేతలు, అభిమానులు, ప్రముఖులతో ఆత్మీయ సమావేశం జరిపి అందరి సమస్యలు విని వాటిని పరిష్కరిస్తానని హామీఇస్తే పార్టీ కార్యకర్తలు ఎంత సంతోషిస్తారో మాటల్లో వర్ణించలేం. అలాంటి కార్యక్రమాన్ని 14వ డివిజన్ లో నిర్వహించి దానికి అధ్యక్షత వహించారు డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి. 23వ తేదీ సాయంత్రం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో బాలాజీ నగర్ లోని త్యాగరాజ స్వామి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం జరిగింది. డివిజన్ ప్రముఖులు, పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చారు. విశ్రాంత ఉద్యోగులు తమకు ఒక భవనాన్ని నిర్మించి అందులో చదువుకొనేందుకు పత్రికలు అందుబాటులో ఉంచాలని కోరగా మంత్రి గారు స్పందిస్తూ మీరే డివిజన్ లో స్థలాన్ని చూపినట్లైతే భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరికొందరు శ్రీనగర్ ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించి ఇవ్వాలని కోరగా మంత్రి గారు బదులిస్తూ దాని గురించి పరిశీలిస్తామన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నేతలు తమకు ఒక కర్మ క్రతువుల భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరగా దానికి మంత్రి అనిల్ కుమార్ గారు సమాధానం ఇస్తూ కర్మ క్రతువుల భవనాన్ని నిర్మిస్తామని, అలాగే ఒక ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవిని బ్రాహ్మణ వర్గానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఉస్మాన్ సాహెబ్ పేటలోని శివాలయం ట్రస్ట్ బోర్డులో తమకు ప్రాతినిధ్యం కల్పించడం పట్ల బ్రాహ్మణ నేతలు మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. మరి కొందరు 14వ డివిజన్ లోని పలు ప్రాంతాలలో రోడ్లు దెబ్బతిని గుంటలు మిట్టలుగా ఉన్నాయని వీటిని మరమ్మత్తులు చేయించాలని, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అందరి సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గారు హామీ ఇవ్వడం పట్ల ఆత్మీయ సమావేశానికి హాజరైన వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మీయ సమావేశానికి సమయం కేటాయించినందుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కృజ్ఞతలు తెలపడంతోపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పొణకా దేవసేనమ్మ , వైయస్సార్ సిపి నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త పొణకా శివ కుమార్ రెడ్డి, యువ నాయకులు పొణకా దివ్య తేజ రెడ్డి లు.
తేది:21-07-2021
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలో "జగనన్న పచ్చతోరణం" కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
పారిశుద్ధ్య కార్మికులకు గతంలో బకాయిలు ఉన్న జీతాలతో పాటు, బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
పొదలకూరు మండల కేంద్రంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించి, కళాశాలకు, వసతి గృహాల్లో ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో "జగనన్న పచ్చ తోరణం" పేరిట 35,653 మొక్కలు నాటేందుకు 5కోట్ల 58 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు సాగు చేసే నిమ్మ, బత్తాయి లాంటి ఉద్యానవన పంటలకు 5కోట్ల 62లక్షల రూపాయలు మంజూరు చేశాం.
👉 చెట్ల పెంపకాన్ని మొక్కుబడిగా కాకుండా "సామాజిక ఉద్యమం" లా చేపట్టాలి.
👉 చెట్లు పెంచక, ఉన్న చెట్లను తొలగించడంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది.
👉 చెట్లు లేనందువల్ల ఆక్సిజన్ సరిగా అందక, మానవాళి కృత్రిమ ఆక్సిజన్ కొరకు డబ్బులు చెల్లించవలసిన దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి.
👉 జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమగ్రంగా అమలు చేయడంతోపాటు, ప్రజలకు అవసరమైన, సూక్ష్మమైన, ఆరోగ్యపరమైన వసతులు కల్పించడంలో భాగమే "జగనన్న పచ్చతోరణం" పధకానికి శ్రీకారం.
👉 ప్రభుత్వం చెట్లు నాటించి, కాపలాదారునితో పాటు, మొక్కలు బతకడానికి అవసరమైన నీరు పోసేందుకు, నెలకు చెట్టుకు దాదాపు 30 రూపాయలు చెల్లించేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ పరిణామం.
👉 గతంలో క్లిన్ అండ్ గ్రీన్ అంటూ ఆర్భాటమైన ప్రకటనలు ఇచ్చిన వారు, సమాజాన్ని క్లీన్ చేయలేక, ప్రజల చేతుల్లో వాళ్లే క్లీన్ అయిపోయారు.
👉 గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు, స్థానిక నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు, అధికారులు అందరూ సమన్వయంతో మొక్కలు నాటించి, నాటిన మొక్కలను సంరక్షించి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని "సుందరవనం" గా తీర్చిదిద్దడానికి అందరం కలిసి పని చేద్దాం.
కావలిలో కర్ఫ్యూ
🔹 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్యెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
---------------------------------------------------------
దేశంలో మూడవ వేవ్ ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో కావలి నియోజకవర్గంలోను , కావలి రెవెన్యూ పరిధిలోను 23 వతేది శుక్రవారం సాయంత్రం 6 గంటలనుండి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించడానికి నిర్ణయం తీసుకున్నట్లు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి వెల్లడించారు . కావలి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన కరోన సమీక్షాసమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు . కావలిలో కరోన కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాపారస్తుల కొరికమేరకు ఆర్డీఓ ఈ నిర్ణయం గైకొన్నట్లు ఆయన తెలిపారు . కావలిలోని వ్యాపారవర్గాల ప్రతినిధులు వచ్చి తమను కలిసారన్నారు . కరోన థర్డ్ వేవ్ ఉధృతంగా వుంటుందని మేధావులు హెచ్చరికలు చేస్తున్నందున కరోన నియంత్రణకు తామంతా స్వచ్చందంగా దుకాణాలకు మూసివేయడానికి నిర్ణయించుకొన్నామని వ్యాపారస్తులు చెప్పడంతో - కర్ఫ్యూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు . ఆర్డీఓ శ్రీను నాయక్ , డీఎస్పీ ప్రసాదరావు , కమీషనర్ శివారెడ్డి , డిప్యూటీ డీఎం & హెచ్ ఓ , మరికొందరు అధికారులు వ్యాపారస్తులు ఈ సమావేశంలో కరోన నియంత్రణ సమస్యపై చర్చించామన్నారు .
విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా జర్నలిజం లో సర్టిఫికెట్ కోర్స్ : ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి
జులై, 21 : నెల్లూరు జిల్లా లోని విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా జర్నలిజం లో సర్టిఫికెట్ కోర్స్ అందిస్తున్నామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. స్థానిక రాష్ట్ర ప్రెస్ అకాడమీ కార్యాలయంలో బుధవారం విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణారెడ్డి తో కలిసి జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ కు సంబందించిన బ్రోచర్ ను శ్రీనాధరెడ్డి విడుదల చేసారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ ద్వారా రాష్ట్రంలోని 6 వేల మందికి శిక్షణ అందియించడం జరిగిందని, 5 వేల మందికి జర్నలిజం పై ముద్రించిన పుస్తకాల పంపిణీ చేయడం జరిగిందన్నారు. చాలా మంది విలేఖరులు పీడీఎఫ్ రూపంలో ఉన్న పుస్తకాలను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా ప్రెస్ అకాడమీ తన కార్యక్రమాలను మార్పు చేసుకుంటున్నదన్నారు. విలేకరులకు ఏ రకమైన శిక్షణ అవసరమో తెలుసుకుని, తమ కార్యక్రమాలను మార్చుకుంటున్నామన్నారు. గ్రామీణ విలేఖరులకు జర్నలిజం పై ప్రాధమిక అవగాహనకు, జర్నలిజం పై ఆసక్తి ఉన్న వారికి అనుకూలంగా ఉండే విధంగా జర్నలిజం లో సర్టిఫికెట్ కోర్స్ ను నెల్లూరు లోని విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా అందిస్తున్నామన్నారు. జర్నలిజం కోర్స్ నడిపే యూనివర్సిటీ కళాశాలల్లో సంవత్సరం పాటు కాలం వెచ్చించడం , హాజరు, అధిక ఫీజు, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని, యూజీసీ గైడ్ లైన్స్ కు అనుగుణంగా సర్టిఫికెట్ కోర్స్ రూపొందించడం జరిగిందన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులలో క్లాసులకు వెళ్లడం కష్టతరం కావున ఆన్లైన్ క్లాస్ ల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కోర్స్ లో మొత్తం 4 పేపర్ లు ఉంటాయని, జర్నలిజం లో రచన నైపుణ్యం, రిపోర్టింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎడిటింగ్ , కొత్తగా వచ్చిన సోషల్ మీడియా, యు ట్యూబ్ , ఇన్స్టాగ్రామ్ అంశాలతో న్యూ మీడియా పేరుతో 4వ పేపర్ ఉంటాయన్నారు. ఒక్కొక్క పేపర్ కి 20 గంటలు, మొత్తం కోర్స్ కి 80 గంటలపాటు శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో జర్నలిజం బోధించే ప్రొఫెసర్లు, జర్నలిజం లో అనుభవం, మంచి పేరున్న జర్నలిస్ట్ లతో క్లాసులు నివహించడం జరుగుతుందన్నారు. స్టడీ మెటీరియల్ కూడా సరఫరా చేస్తామన్నారు. వివిధ వార్తా సంస్థలలో ఇంటీరియం శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఉతీర్ణులైనవారికి వివిధ మీడియా సంస్థలలో ఉపాధికి కూడా సహకరిస్తామన్నారు. ఈ కోర్స్ 3 నెలల పాటు ఉంటుందన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రముఖ కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ లకు 1500 రూపాయలు, డిగ్రీ చదివి వర్కింగ్ జర్నలిస్ట్స్ కానివారికి కూడా అవకాశం ఉందని వారికీ 3000 రూపాయల కోర్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంత విలేఖరులు, జర్నలిజం పై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీనాధ్ రెడ్డి విజ్ఞప్తి చేసారు.
నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో పనిచేసే ఆచార్యుల కమిటీ ఈ కోర్స్ సిలబస్ రూపొందించిందన్నారు.
ఈ కోర్స్ సర్టిఫికెట్ కు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కోర్స్ కు దరఖాస్తు చేసేందుకు వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటర్మీడియట్, జర్నలిస్ట్ కానివారు డిగ్రీ ఉతీర్ణులై ఉండాలన్నారు. 20 క్లాసులు పూర్తి అయ్యాక అసైన్మెంట్ లు రాయవలసి ఉంటుందని, 30 మార్కులు చొప్పున ఉంటాయని, తుది పరీక్షలకు ఒక్కొక్క సబ్జెక్టు కు 70 మార్కులు ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తామని, దరఖాస్తుకు చివరి తేదీ ఆగష్టు 20వ తేదీచెప్పారు అని కృష్ణారెడ్డి చెప్పారు. ప్రెస్ అకాడమీ కార్యదర్శి కె.బి.జి. తిలక్, ప్రభృతులు పాల్గొన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నుడా చైర్మన్ గా నియమితులైన ముక్కాల ద్వారకానాధ్ గారు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నుడా చైర్మన్ గా నియమితులైన ముక్కాల ద్వారకానాధ్ గారిని ఎమ్మెల్యే కాకాణి అభినందించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన నివాసంలో
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన శ్రీమతి షేక్ సైదాని గారికి అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.
నెల్లూరు స్పెషల్ ఎన్ఫోస్మెంట్ అధికారులు గంజాయి అక్రమ రవాణాపై మెరుపు దాడులు నిర్వహించారు.విశాఖపట్నం నుండి చెన్నైకి ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి రూపంలో ఉన్న ద్రావణాన్ని ,గంజాయిని సీజ్ చేశారు.. ముందస్తు సమాచారంతో నెల్లూరులోని సుబ్బారెడ్డి స్టేడియం వద్ద ఆర్టీసీ బస్సును అపి అధికారులు తనిఖీలు చేయగా.. అందులో గంజాయి గుర్తించారు..మరోవైపు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ద్రవ రూపంలో ఉండే గంజాయి ద్రవాన్ని స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు నాలుగు లక్షల ముప్పై వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.
విశాఖనుంచి బెంగుళూరు ,చెన్నై కు అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఈ దాడులు నిర్వహించామని తెలియజేశారు.జిల్లాలో తొలిసారిగా లిక్విడ్ గంజాయి పట్టుకోవటం జరిగిందన్నారు.
గంజాయి తరలిస్తున్న ప్రవీణ్ రాజ్,హరీష్ రాజ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని తెలియజేశారు.
కవల పిల్లలు హత్య కేసును ఛేదించిన పోలీసులు
కసాయి తండ్రి అరెస్ట్
తన భార్యపై అనుమానంతో పుట్టిన కవలపిల్లల లకు గుళికలు ను పాలలో కలిపి తండ్రే హత్య చేసినట్లు పోలీసులు కేసు దర్యాప్తులో తేల్చారు. గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మనుబోలు పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఆదివారం నిర్వహించారు. జూన్ నెల 20 వ తేదీన మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతి పరిధిలోని రాజవోలు పాడు చెందిన పుట్టా వెంకట రమణయ్య బాలయపల్లె మండలం వెంగమాంబాపురం నకు చెందిన నగిరిపాటి నాగ రత్నమ్మను ప్రేమించి పెద్దలను ఎదిరించి కసుమూరులో పెండ్లి చేసుకున్నాడు.మొదటి పెళ్లి గురించి చెప్పకుండా దాచిందని భార్య మోసము చేసిందని భావించి, పిల్లలు ఇద్దరినీ చంపి భార్య మీద ఆ నింద మోపితే ఎలాగైనా విడిపించుకోవచ్చని క్రూర పూరితంగా అలోచించి, పిల్లలు తాగే పాలలో గుళికలు మందు కలిపి త్రాగించి, ఎవరికీ అనుమానము రాకుండా, ఏమి తెలియనట్లుగా అందరితో కలిసి పిల్లలను హాస్పిటల్స్ కు తిప్పుతూ, చివరికి చనిపోయినట్లు తెలపడంతో, ఇద్దరు పిల్లలను స్వగ్రామమునకు తీసుకునివచ్చినాడు,ఏమి తెలియనట్లుగా అందరితో కలిసి పిల్లల వద్ద కూర్చుని ఏడ్చినట్లు నటించాడు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేసు వివరములు కుణ్ణంగా పరిశీలించి తేది.17.07.2021 న మద్యాహ్నము సుమారు 4.00 గంటలకు ముద్దాయిని వీరంపల్లి రోడ్ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చి గూడూరు రూరల్ సి.ఐ శ్రీనివాసులు రెడ్డి మనుబోలు SI ముత్యాల రావు విచారణ చేపట్టారు. ముద్దాయి తన నేరాన్ని ఒప్పుకోవడంతో, ముద్దాయి ని 17.07.2021 న సాయంత్రం 5.30 గంటలకు మనుబోలు పోలీస్ స్టేషన్ నందు అరెస్ట్ చేయడమైనని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయుటలో కీలక పాత్ర పోషించిన గూడూరు రూరల్ సి ఐ పి. శ్రీనివాస రెడ్డి, మనుబోలు ఎస్ ఐ కె.ముత్యాలరావు, రాజు,నారయ్య, ఆదినారాయణ,విష్ణు,లాజర్ ల ను గూడూరు డి.యస్.పి. శ్రీ రాజగోపాల్ రెడ్డి అభినందించి, రివార్డులు అందజేసినాడు.
నుడా చైర్మన్ గా ఎంపికైన అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్చము అందించడం జరిగింది. అనంతరం రూరల్ ఎమ్మెల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయనను శాలువాతో సత్క
ఏపి ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా నియమించబడిన శ్రీమతి ఎస్.కె. సైదాని గారిని నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అభినందించి సన్మానించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
🔹 దేశచరిత్రలోనే ఎన్నడూలేనివిధంగా ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలకు 50% అన్ని రంగాలలోను పదవులు కేటాయించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 మహిళలు ఇంటికే పరిమితం కాకుండా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో వారికి తాను అన్నిటికి అండగా ఉంటూ, భరోసా కల్పిస్తూ మహిళలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి గారిని ప్రశంసించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 మొదటినుంచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ఎస్.కే. రియాజ్ సతీమణి సైదాని గారిని ముఖ్యమంత్రి గారికి మానసపుత్రికగా ఉన్న ఏపి ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా నియమించడం సంతోషించే విషయం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 పార్టీకోసం కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికి తప్పకుండా ఫలితం దక్కుతుంది అనేదానికి నిదర్శనం నేడు సైదాని గారిని ఏపి ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా నియమించడం. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి గారికి, జిల్లా మంత్రులకు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మెన్ గా ఎంపికైన శ్రీ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్చము అందించడం జరిగింది. అనంతరం రూరల్ ఎమ్మెల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనను శాలువాతో