*కరోనా నియంత్రణలో ప్రభుత్వం ఘోర వైఫల్యం కారణంగా ఆక్సీజెన్ అందక చనిపోయిన మృతుల కుటుంబాలకు ఏక్సిగ్రేషియా చెల్లించాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన జర్నలిస్టులకు 50 లక్షల భీమా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ పిలుపుతో నెల్లూరు అర్బన్ MRO గారికి మాజీ కార్పొరేటర్ పిట్టి సత్యనాగేశ్వర రావు ఆధ్వర్వంలో వినతిపత్రం సమర్పించారు*
ఇదేం ప్రభుత్వం బాబో అనేలా జగన్ అనుభవలేమి పాలన ఉందని నెల్లూరు టీడీపీ మాజీ కార్పొరేటర్ పిట్టి సత్య నాగేశ్వర్స్ రావు అన్నారు.
సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా వేల కరోన మరణాలు సంభవించాయని టిడిపి నేత *పిట్టి సత్య నాగేశ్వరరావుతో పాటు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జ్లు ఆరోపించారు*.. కరోనాతో మృతి చెందిన వారికి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిటీ ఇంచార్జ్ శ్రీనివాసులు రెడ్డి ఆదేశాల మేరకు సిటీ ఎమ్మార్వో కార్యాలయం వద్ద టిడిపి నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా కరుణ విలయతాండవం చేస్తుంటే.. నియంత్రణ చర్యలు చేపట్టిన సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయటికి రాలేదని మండిపడ్డారు.. కరోనాతో మృతి చెందిన మరణాలన్ని ప్రభుత్వ హత్యలేనని ఆయన మండిపడ్డారు..
కరోనా తో మృతి చెందిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు బ్లాక్ ఫంగస్ తో చనిపోయిన వారికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయన ఎమ్మార్వోకి వినతి పత్రం సమర్పించారు..
Post a Comment