తాడేపల్లి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ -19 ఖరీఫ్ సీజన్ సన్నద్ధత, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం , గ్రామ సచివాలయాలు, పేదలందరికీ ఇల్లు తదితర పథకాలపై పై జిల్లా కలెక్టర్లతో ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గినప్పటికీ ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కోవిడ్ మహమ్మారి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. కోవిడ్ 19 కి సంబంధించి మూడవ వేవ్ కి తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు సంబంధించి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా జరుగుతున్న పనులను ముమ్మరం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, జాయింట్ కలెక్టర్ లు గణేష్ కుమార్, బాపి రెడ్డి , విదేహ్ ఖరే , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజ్య లక్ష్మి, డిపిఓ ధనలక్ష్మి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రోజ్ మండ్, డ్వామా పిడి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు
Post a Comment