రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకోవడం లో పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య

 బుధవారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు, నెల్లూరు పార్లమెంట్ టీడీపి అధ్యక్షులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జీ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు సాబీర్ ఖాన్, జలదంకి సుధాకర్ మరియు ఇతర నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు కలిసి నెల్లూరు రూరల్ mro గారి కార్యాలయం ఎదురుగా నిరసన చేసి, రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం అందజేశారు.....


==============================


ఈ సందర్భంగా



రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య మాట్లాడుతూ...


రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకోవడం లో పూర్తిగా విఫలమైందని, ప్రపంచ ఆరోగ్య సంస్థలు రెండో వేవ్ వస్తుందని ఎంత హెచ్చరించినా వాటిని పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం వహించి అనేక మంది చావులకు కారణం అయ్యారని అన్నారు....


కరోనా వచ్చిన వారికి, ప్రభుత్వం కనీసం భరోసా ఇచ్చిన పాపాన పోలేదని, రాష్ట్రంలో ఆక్సిజన్ అందక అనేక మంది కేవలం భయపడి ప్రాణాలు కోల్పోయారని అన్నారు...


ఈ చావుల అన్ని ప్రభుత్వ హత్యగా పరిగణిస్తున్నామని వీటికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి దేనని అన్నారు...


కనీసం ఫ్రంట్లైన్ వారియర్స్ కి ఇంజక్షన్ కూడా అందించలేని పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందని అన్నారు


ఈరోజు పేద మధ్య తరగతి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోతున్నారని కనీసం దహన సంస్కారాలకు కూడా సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం దారుణం అని అన్నారు...


కరోనా ఫస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ఇప్పటివరకూ సహాయాన్ని అందించకపోవడం సిగ్గుచేటని ప్రజలు వీటిని గమనించాలని కోరారు


ఈ సందర్భంగా సాబీర్ ఖాన్ మాట్లాడుతూ....


కరోనా బాధితుల సహాయక చర్యలు చేపట్టడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందున, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పలు రకాల డిమాండ్ లతో నిరసన కార్యక్రమాలు చేపట్టారని అన్నారు...


కరోనా చావులను ప్రభుత్వ హత్యలుగా పరిగణిస్తూ, కరోనా లో ఉపాధి కోల్పోయిన వారికి 10 వేలు, కరోనా తో మరణించిన వారికి 10 లక్షలు, బ్లాక్ ఫంగస్ తో మరణించిన వారికి 20 లక్షలు, ప్రభుత్వ వైఫల్యం వల్ల మరణించిన వారికి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు....


దేశం లో కరోనా విలయతాండవం చేస్తున్నా సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వైసీపీ నాయకులు నిమ్మకు నీరెత్తి నట్టు ఉన్నారని, వైసీపీ వారి వాగ్దానాలు పేపర్లకే అయ్యాయని, ఆచరణ లోకి రావడం లేదని అన్నారు....


నెల్లూరు రూరల్ లో విజయ్ అనే తెలుగుదేశం నాయకుడి ఇంట్లో , ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల 10 రోజుల వ్యవధి లో ఒకే ఇంట్లో ముగ్గురిని కోల్పోయారని, వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయం అందలేదని అన్నారు.....


మాకు తెలిసి ఇదొక్క కుటుంబమేనని కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారని, దీని మీద వెంటనే దృష్టి సారించి తక్షణమే సహాయక చర్యలు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.....


ఈ సందర్భంగా జలదంకి సుధాకర్ మాట్లాడుతూ...


దాదాపు రెండు సంవత్సరాలుగా, కరోనా మహమ్మారి ప్రజలను అస్తవ్యస్తం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా టీడీపీ హయం లో ప్రవేశపెట్టిన సంక్షేమలను రద్దు చేసిందని అన్నారు....


చంద్రన్న భీమా ఉండి ఉంటే, ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఎంతో ఉపయోగపడేదని, ప్రతీ ఒక్కరికీ 5 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందేదని అన్నారు....


ఈ లాక్ డౌన్ సమయం లో అన్నా కాంటీన్లు ఉండి ఉంటే లాక్డౌన్ వల్ల ప్రజలు భోజనానికి ఇబ్బంది పడేవారు కాదని అన్నారు...


కరోనా తో మృతి చెందిన వారికి 10 లక్షలు ఇవ్వాలని అలాగే మీడియా సోదరులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగణించి, కరోనా తో చనిపోయిన మీడియా సోదరులకు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు....


అన్నా కాంటీన్ లను తిరిగి ప్రారంభించి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తగ్గించాలని అన్నారు...


పై కార్యక్రమంలో జియా ఉల్ హక్, గంగాధర్, అమృల్లా, చెల్లా భాస్కర్, మౌలానా అజీజ్, అస్లాం, విజయ్, రాజేష్, వేమా హజరత్, సత్తార్, ముజాహీద్, రబ్బానీ, జావీద్ తదితరులు పాల్గొన్నారు.....

[3:54 pm, 16/07/2021] Praveen Photographer Ravikiranalu: ఫాజిల అనే యువతిని ప్రేమించి పెళ్లాడుతా నని మోసం చేసిన మెప్మా ఉద్యోగి షాకీర్ ఆ యువతికి న్యాయం జరగాలని  మెప్మా ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించిన ఏఐవైఎఫ్ నాయకులు.....

ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ షాకీర్. ఫాజిల  అనే యువతి వెంటపడి ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని తన పెద్ద వారిని కూడా తీసుకు వచ్చి మాట్లాడించి ఆ అమ్మాయిని గర్భవతిని చేసి వదిలేశాడు ఇప్పుడు ఆ అమ్మాయికి మూడు నెలల బాబు ఉన్నాడు అయితే షాకీర్ కి ఇంతకుముందే పెళ్లి అయ్యి ఒక కొడుకు  ఉన్నాడు ఆ విషయాన్ని దాచిపెట్టి వాళ్ళ పెద్ద వాళ్ళు అందరూ కలిసి ఈ అమ్మాయిని దారుణంగా మోసం చేశారు ఈ అమ్మాయికి తగిన న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తారు ఈ కార్యక్రమంలో షాన్ వాజ్. మున్నా. ముక్టియార్. నూర్ ఖాన్. రఫీ. గౌస్. దస్తగిరి. షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget