తమిళనాడు 14 వ ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. స్టాలిన్‌తోపాటు 34 మంది మంత్రులతోనూ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్ క్యాబినెట్‌లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు చోటు దక్కింది. హోం, సాధారణ ప్రజా వ్యవహారాల నిర్వహణ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తదితర విభాగాలను స్టాలిన్ తన వద్దే ఉంచుకున్నారు. అయితే, చెపాక్ నుంచి విజయం సాధించిన తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు మాత్రం ఏ పదవీ ఇవ్వలేదు.
ఆర్థికశాఖ- పీడీఆర్ పళనివేల్ త్యాగరాజన్, ఆరోగ్యశాఖ- సుబ్రమణ్యం, డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్- జలవనరులు, చిన్న, భారీ తరహా నీటి ప్రాజెక్టులు, అసెంబ్లీ వ్యవహారాలు శాఖ, కె.ఎన్.నెహ్రు- మున్సిపల్ నిర్వహణ, పట్టణ తాగునీటి సరఫరా, పెరియస్వామి- సహకారశాఖ, పొన్ముడి- ఉన్నత విద్యాశాఖ, ఈ.వీ.వేలు- ప్రజాపనుల శాఖ, ఎంఆర్కే పన్నీర్‌సెల్వం- వ్యవసాయం, రైతుల సంక్షేమం, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్- రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ, తంగం తెన్నరసు-పరిశ్రమలు, తమిళ భాష, సాంస్కృతిక, పురావస్తు శాఖలు.
రఘుపతి- న్యాయశాఖ మంత్రి, ముత్తుస్వామి- గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, పెరియకరుప్పన్- గ్రామీణాభివృద్ధి, టీఎం అన్బరసన్- గ్రామీణ పరిశ్రమలు, ఎం.పీ.స్వామినాథన్- సమాచార, ప్రచారశాఖ, గీతాజీవన్- సాంఘిక, మహిళ శిశుసంక్షేమం, అనితా రాధాకృష్ణన్- మత్స్య, పశుసంవవర్ధకం, ఎస్ ఆర్ రాజకన్నప్పన్- రవాణా, రామచంద్రన్- అటవీశాఖ, చక్రపాణి- ఆహారం, పౌరసరఫరాలు, సెంథిల్ బాలాజీ- విద్యుత్, ప్రొహిబిషన్, కస్టమ్స్, ఆర్.గాంధీ- చేనేత, టెక్ట్స్‌టైల్స్, పీ.మూర్తి- వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, ఎస్ఎస్ శివశంకర్- వెనుకబడిన తరగతుల సంక్షేమం.
పయనివేల్ త్యాగరాజన్- ఆర్థిక, మానవవనరుల అభివృద్ధి, ఎస్ఎం నాజర్- పాడి అభివృద్ధి, సెంజిమస్తాన్- మైనారిటీ, విదేశీ తమిళుల సంక్షేమం, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి- పాఠశాల విద్యాశాఖ, మెయ్యనాథన్- పర్యావరణ, యువజన, క్రీడా అభివృద్ధి, సీవీ గణేశన్- కార్మిక సంక్షేమం, మనోతంగరాజ్- సమాచార సాంకేతిక శాఖ, మతివేందన్- పర్యాటకం, వీకే శేఖర్‌బాబు- హిందూ దార్మికశాఖ,కయల్‌విళి సెల్వరాజ్- ఆదిద్రావిడ సంక్షేమం
కరోనా నేపథ్యంలో ఈ వేడుకకు కార్యకర్తలను అనుమతించలేదు. కాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో మాజీ సీఎంల కుమారులు ముఖ్యమంత్రులయ్యారు. అయితే, తమిళనాడులో మాత్రం ఓ మాజీ సీఎం కుమారుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. తొలిసారిగా మాజీ సీఎం కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఆ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు.
Post a Comment