రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం.. టిడిపి నేతలు సవాల్ స్వీకరించే దమ్ము ఉందా - మంత్రి అనిల్
కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభను వాయిదా వేసుకుంటే టిడిపి నేతలు కారు కూతలు కూస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడిపోతే 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని స్వీకరించే దమ్ము ధైర్యం టిడిపికి ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో 20 శాతం కూడా స్థానిక సంస్థలలో గెలవలేకపోయారని. చంద్రబాబుకు కుప్పంలో నారా లోకేష్ కు మంగళగిరిలో ప్రజలు దూల తీర్చారు. అయిన అబ్బా కొడుకులకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేసాడు.
Post a Comment