ఇంటి నుంచి చెత్త సేక‌రించేందుకు డ‌బ్బులా..? న‌వ‌ర‌త్నాల్లో ఇదో ర‌త్న‌మా..? - నెల్లూరు సిటి ఇన్చార్జి వ్యంగ్యాస్త్రాలు..



 ఇంటి నుంచి చెత్త సేక‌రించేందుకు డ‌బ్బులా..? న‌వ‌ర‌త్నాల్లో ఇదో ర‌త్న‌మా..? - నెల్లూరు సిటి ఇన్చార్జి వ్యంగ్యాస్త్రాలు...


ఇంటింటి నుంచి చెత్త సేక‌రించేందుకు కార్పొరేష‌న్ సిబ్బంది ఒక్కో ఇంటికి 40 రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నార‌ని సిటి ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి మండిప‌డ్డారు.. జ‌గ‌న్ ప్ర‌వేశపెట్టిన న‌వ‌ర‌త్నాల్లో చెత్త‌సేక‌ర‌ణ‌కు 40 నుంచి వేల రూపాయ‌లు వ‌సూలు చెయ్య‌డం కూడా ఒక ర‌త్న‌మ‌ని ఆయ‌న వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. నెల్లూరులోని మినిబైపాస్ రోడ్డులో ఉన్న‌ పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న  మీడియాతో మాట్లాడారు.. కొత్త‌గా ఏర్పాటు చేసిన స‌చివాల‌యాల ఖ‌ర్చుల‌ను కార్పొరేష‌న్ కు అప్ప‌గించ‌డ‌తో,, దాన్ని పూడ్చుకునేందుకు కార్పొరేష‌న్ అధికారులు పన్నులు పెంచేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఒక్కో స‌చివాల‌యానికి  మెయింటైన్స్కు  నెల‌కు 20ల‌క్ష‌ల దాకా  ఖ‌ర్చు అవుతుంద‌న్నారు..దాన్ని పూడ్చుకునేందుకు ఇలా ప్ర‌జ‌ల‌ను పీల్చుకు తింటున్నార‌ని మండిప‌డ్డారు.. ఆస్తి ప‌న్నులు క‌ట్ట‌క‌పోతే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నార‌ని, ఎవ‌రెబ్బ సొమ్మ‌ని స్వాదీనం చేసుకుంటార‌ని ప్ర‌శ్నించారు. క‌రోనాతో వ్యాపారాలు లేక అల్లాడుతున్న వారిని బెదిరిస్తే ఆందోళ‌న చేస్తామ‌ని హెచ్చ‌రించారు.. భ‌విఫ్య‌త్ లో పెర‌గ‌బోయే ఇంటి పన్నుల‌పై ప్ర‌జ‌లు,  అన్ని పార్టీల‌తో క‌లిసి ఉద్య‌మాలు చేస్తామ‌నిఆయ‌న అన్నారు. పై కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రామనహ్య,మాజీ కార్పొరేటర్ వచ్చి భువనేశ్వర్ ప్రసాద్ ,కొండ ప్రవీణ్ ,సురేష్, ఆకుల హనుమంతరావు, పసుపులేటి మల్లికార్జున, సృజన్ నాగేంద్ర, ప్రవీణ్, సుఖేష్ వర్ధన్ రెడ్డి నాగార్జున తదితరులు పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget