వైసిపికి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి కనుమూరు హరిశ్చంద్ర రెడ్డి రాజీనామా
⚪ ఇటీవల చోటుచేసుకున్న దురదృష్టకర ఘటనల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ నిర్ణయం
🟢 రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చాను
⚪ కుటిల రాజకీయాలకు ఇంక నుండి దూరం
గూడూరు పట్టణ ప్రజల కోసం,గూడూరు అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు, ఎవరూ ఊహించని విధంగా* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు గురువారం హరిశ్చంద్ర రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు ,పార్టీ కోసం శ్రమిస్తున్న కూడా అసత్యపు ఆరోపణలు చేయడం,తన దుష్ప్రచారం చేయడం వంటి ఎన్నో పరిణామాలు తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరిశ్చంద్ర రెడ్డి వెల్లడించారు.
చెన్నై నుంచి హరిశ్చంద్ర రెడ్డి మాట్లాడుతూరాజకీయాలకు తాను కరెక్ట్ కాదేమో .. పొరపాటున వచ్చినట్లు ఉన్నానన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలు తెలియదు. ఈ రంగంలో ఉండలేనని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన వరుస దురదృష్టకర ఘటనల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తన వల్ల గూడూరు ప్రజలకు ఏదైనా తప్పు జరిగి ఉంటే మన్నించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అప్పటినుంచి ఇప్పటివరకు అన్ని విధాలుగా తనకు సహకరించిన కార్యకర్తలకు, నాయకులకు ప్రజలకు, పార్టీ అధినేత సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్తూ తన అభిప్రాయాన్ని ముగించారు.
తాను గూడూరు ప్రజల సేవకుడు గా కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవలు చేస్తాను అనీ, రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు,హరిశ్చంద్ర రెడ్డి నిర్ణయం పట్ల వైసిపి నేతలు,కార్యకర్తలు, అభిమానులు నిరాశ నిసృహనికి లోను అయ్యారు,తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో హరిశ్చంద్ర రెడ్డి నిర్ణయం గూడూరు లో తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది.
Post a Comment