సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి 200 కుటుంబాలు చేరిక

 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, పైనాపురం గ్రామం నుండి గ్రామ పంచాయతీ సర్పంచ్ కావలి విజయ్ కుమార్, దాసరి చంద్ర, పట్టపు నరసింహాలతో కలిసి 200 కుటుంబాలను  సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు మరియు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు శివ ప్రసాద్, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునుకూరు బాబీ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget