జిల్లా పోలీసు కార్యాలయంలో అంబేడ్కర్ 130 వ జయంతి

 డా భీంరావ్ రాంజీ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ భాస్కర్ భూషణ్,IPS.,మరియు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి పి.వెంకటరత్నం, ఇతర జిల్లా అధికారులు సామాజిక దూరం పాటిస్తూ, పూలమాలవేసి  ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా యస్.పి. మాట్లాడుతూ భారతరత్న అవార్డు గ్రహీత డా.B.R. అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో)  రాంజీ మలోజీ సాక్పాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు. వీరిది  మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం. వీరి తండ్రి భారత దేశానికి మోహో సైనిక స్థావరంలోని బ్రిటీష్ సైన్యంలో పనిచేసి సేవలు అందించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్ బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు, ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు ఊపిరిపోసింది. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. 1956 లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. 1990 లో భారత ప్రభుత్వం అత్యున్నత భారత రత్న పురస్కారాన్ని ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు. అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ 1956 డిసెంబరు 6 న కన్ను మూశాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన గొప్ప వ్యక్తి డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ గారు. నేడు వారి "జయంతి" సందర్భంగా ఆ మహావీరుడి కి నమస్సుమాంజలు అర్పించుకుందాం. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి.(ఎ.ఆర్) శ్రీ యస్.వీరభద్రుడు, డి.యస్.పి.(ఎ.ఆర్.) శ్రీ యం.గాంధీ, డి.యస్.పి.-HG శ్రీ శ్రీనివాసరావు, వెల్ఫేర్ RI శ్రీ శ్రీకాంత్, RI(అడ్మిన్) శ్రీ శ్రీనివాసులు రెడ్డి, RI-HG శ్రీ పౌల్ రాజ్ గార్లు, ఇతర అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.  

Labels:

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget