తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలని తెలుగుదేశం పార్టీ
తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గ అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని బుధవారం తోటపల్లిగూడూరు మండలం కొత్తపాళెం నుంచి ప్రారంభించారు. అనంతరం పనబాక లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. అనంతరం మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరిగిపోయాయని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.70 ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు రూ.150గా చేరిందని, దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీలో వైఫల్యం చెందిందన్నారు. సర్పంచుగా పోటీ చేసిన అభ్యర్థులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్నారు. ఇవన్ని వైసీపీ అరాచక పాలనకు ప్రజలు స్వస్తిచెప్పి టీడీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు ఇన్‌చార్జి నరసింహయాదవ్, టీడీపీ నాయకులు బీద రవిచంద్ర, చెంచలబాబు యాదవ్, ఆనం వెంకట రమణారెడ్డి, బొమ్మి సురేంద్ర, సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment