పార్టీ ఓటమికి కారణం కార్యకర్తలు కాదు - ఓటమికి అనేక కారణాలు :
బీద రవిచంద్ర శాసన మండలి సభ్యులు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన వెంకటగిరి నియోజకవర్గ తెదేపా విస్తృతస్థాయి సమావేశం లో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ....
👉 రాష్ట్రంలో తొమ్మిది సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు, గూడూరు, సూళ్లూరుపేట నియోజక వర్గాల నుంచి 5 సార్లు టీడీపీ గెలిచింది.
👉 ఎన్ని సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా గూడూరు డివిజన్ పరిధిలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు లలో అత్యధిక సార్లు విజయం తెదేపా ను వరించింది.
👉 సూళ్లూరుపేట నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. గ్రామ, మండల స్థాయి లో నాయకులు, కార్యకర్తలు అత్యంత చురుకు గా అందుబాటు లో ఉంటారు.
👉 2019 లో టీడీపీ ఓడిపోవడానికి కారణం కార్యకర్తలు కాదు... ఎన్నికల్లో జరిగిన లోపాల కారణంగానే వైసీపీ మెజారిటీ సాధించింది.
👉 గతం లో చేసిన తప్పిదాలను సరి దిద్దుకుందాం. పార్టీ కూడా ఇక్కడ జరుగుతున్న తప్పిదాలను గుర్తించింది.
👉 తెదేపా రాష్ట్ర, పార్లమెంట్ కమిటీలలో సమర్థులకు , చురుకు గా వ్యవహరించే వారిని గుర్తించి బాధ్యతలు అప్పగించారు.
👉 అందరూ సమిష్టి గా పని చేసి, తెదేపా కంచుకోట అయిన నియోజక వర్గాల్లో వైసీపీ గెలిచిందన్న నింద ను తొలగించుకుందాం.
👉 2019 ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ చెప్పిన అబద్దం చెప్పకుండా చెప్పి ప్రజలను పక్క దారి పట్టించింది.
👉 కేంద్ర ప్రభుత్వం కు అమ్ముడు పోయామని, ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నామని నిందలు వేసింది. వైసీపీ అధికారం లోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని బీరాలు పలికింది.
👉 ప్రత్యేక హోదా, పోలవరం నిధులకోసం తెదేపా ఎంపీ లు ఎన్టీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు.
👉 కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ నేడు ప్రత్యేక హోదాను పక్కన బెట్టారు.
👉 ఈనాడు వైసీపీ ప్రభుత్వం తన స్వ ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కును సైతం తాకట్టు పెట్టింది.
👉 అధికారం లోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా రామాయ పట్నం, దుగ్గరాజపట్నం పోర్ట్ లు సాధించలేక వైసీపీ ప్రభుత్వం చతికిల పడింది.
Post a Comment