నాయుడుపేట:-
జాతీయ రహదారి పై ఓజిలి మండలం రాజుపాలెం వద్ద శనివారం రాత్రి రూ 30 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను ఎస్ ఈ బి ,సి ఐ అబ్ధుల్ జలీల్ తన సిబ్బంది తో కలసి నిర్వహించన తనికీల్లో భాగంగా పట్టుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్ ఈ బి ఫై ఎస్ పి లు బి.వెంకటేశ్వర్లు,ఈ. శ్రీనివాసరావు , మాట్లాడారు. కర్ణాటక లోని తుముకూరు నుండి కాకినాడ లోని తారా ఏజెన్సీ కి సుమారు రూ 30 లక్షల విలువ గల 50 బస్తాలు (15 లక్షల 60 వేల గుట్కా ప్యాకెట్లు)గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న లారీ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.లారీ లోని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.అక్రమ గుట్కా,మద్యం,పేకాట,కోడిపందెలా నివారించేందుకు ప్రజలు సహకరించాలన్నారు.వేటు వివరాలు తెలియజేసే వారి పేర్లు గోప్యం గా ఉంచుతామన్నారు.జిల్లాలో కోడి పందేల పై దాడులు నిర్వహించి అరెస్ట్ చేసిన
నాయుడుపేట ఎస్ ఈ బి,సి ఐ
షేక్. అబ్దుల్ జలీల్,ఎస్ ఐ శేషమ్మ లను అభినందించారు.నాయుడుపేట సర్కిల్ పరిధిలో అక్రమ మద్యం,గుట్కా వ్యాపారాన్ని నివారించేందుకు కృషి చేస్తున్న సి ఐ, అబ్దుల్ జలీల్,శేషమ్మ లు అభినందించారు.ఈ సనవేశం లో ఎస్ ఈ బి,సి ఐ అబ్దుల్ జలీల్,ఎస్ ఐ శేషమ్మ వున్నారు.
--------------------------------------------
జనసేన ఆలోచనలు ఆశయాల పట్ల యువత ఆకర్షితులవ్వడం ఆనందంగా ఉందని జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు..నెల్లూరు నగర నియోజక వర్గంలోని 40 మరియు 41 డివిజన్లకు చెందిన 100మంది యువకులు నెల్లూరు నగర కార్యాలయంలో కేతంరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు..వారిని కేతంరెడ్డి కండువా కలిపి పార్టీలోకి ఆహ్వానించారు..ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజక వర్గంలో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో.. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని..ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కలిగించి చైతన్య పరుస్తున్నామని
అందుకే యువత జనసేన పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు..వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని..ఇప్పటి వరకు జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం అని ఆయన అన్నారు..రోజు రోజుకు జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని అందుకే 6 శాతం ఓటింగ్ నుండి 18 శాతానికి చేరుకున్నామని ఆయన అన్నారు..రానున్న స్థానిక సంస్థల మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకుపోతామని నెళ్లురు నగర నియోజక వర్గంలో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు..కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి,కాకు మురళి రెడ్డి,సురేష్ నాయుడు,కస్తూరయ్య యాదవ్, వెంకట్,హేమంత్ రాయల్,నాగరాజు,రాము,చరణ్,ఈశ్వర్,కేశవ,మహేష్,శివ,రాజేష్,హంస కుమార్ రెడ్డి,కృష్ణ,నరేంద్ర,హరి,సన్నీ,ఉదయ్,అక్షిత్, రాకి,గణేష్,పవన్,నవీన్,నాని,గోపి,సురేష్,తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు విషయంలో మారో మాట లేదు... స్పష్టం చేసిన ఆనం
నెల్లూరు నగరం:
గుడివాడ వైకాపా కార్యాలయం లో రెండో విడత పంచాయతీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులతో సమావేశమై వారి ని అభినందించిన
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన.. నాని
ABN రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు రెండో విడత పంచాయతీ ఎన్నికలలో నాకు సంబంధం లేని నియోజకవర్గం ఓక గ్రామంలో ఓడిపోతే అడ్డమైన రాతలు రాస్తున్నారు..
పామర్రు నియోజకవర్గం లో ఉన్న యలమర్రు లో వైకాపా ఓడిపోతే అది నాకు ఎదురు దెబ్బ అని సంబరాలు చేసుకుంటున్నారు.
నా మీద లేనిపోని రాసి చంద్రబాబు నాయుడు సంక నాకుతున్నారు...
యలమర్రు గ్రామం మా పూర్వీకులు ఉండే వారు...
మా నాన్న, గుడివాడ లోనే పుట్టారు, నేను గుడివాడ లోనే పుట్టాను నా సోంత ఊరు గుడివాడ
యలమర్రు గ్రామంలో ఎవరు తెలుగుదేశం, ఎవరు వైకాపా నాయకులో నాకు తెలియదు నా నియోజకవర్గం కూడా కాదు...
రామోజీ రావు కు, రాధాకృష్ణ కు దమ్ముంటే నాతో యలమర్రు గ్రామంలో రండి నేను గ్రామంలో ఎవరినైనా ఓటు అడిగాను అని చెబితే ఈ రాజకీయాలు వదిలి ఈ రాష్ట్రంలో కూడా ఉండను..కాదు అని తెలితే రాధాకృష్ణ, రామోజీరావు వారి పేపర్ల వదిలి వెళ్ళతారని అన్నారు..
గుడివాడ నియోజకవర్గం లో 58 పంచాయతీలకు 43 పంచాయతీ లు మనమే కైవసం చేసుకున్నాం..అది కనపడలేదా ..వాళ్ళకి
మేజర్ పంచాయతీ లలో భారీ మెజారిటీతో ఎన్నికలలో గెలవడం జరిగింది
యలమర్రు లో నేను అభ్యర్థి నిలబెట్టి రాజకీయం చేశానో లేదో 21వ తేదిన తెలుద్దాం..
ఈనెల 21వ తేదిన తెలుద్దాం..యలమర్రు నాదా..లేక రామోజీరావు, రాధాకృష్ణ తో తెలుస్తుంది
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఫిబ్రవరి, 14; గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని
నెల్లూరు జిల్లా వైసీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సిద్దాన సుబ్బారెడ్డి సహా న్యాయవాదుల బృందం కలిసి అభినందనలు తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున కేటాయించిన న్యాయవాదుల పనితీరును మంత్రి గౌతమ్ రెడ్డి ప్రశంసించారు.
న్యాయపరమైన సలహాలిస్తూ అవాంతరాలను తొలగించడంలో ఎప్పటికప్పుడు సమాచారం అందించిన 13 మంది బృందానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చిన్నారెడ్డి, మనోహర్, విద్యాధర్ రెడ్డి, వంశీ రెడ్డి, సాయి రెడ్డి, కమలాకర్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆటోనగరులో దాదాపు 8కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు,డ్రైన్లు,కల్వర్టులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..
ఈ 8కోట్ల రూపాయలతో దాదాపు ఆటోనగర్ సగం భాగం మాత్రమే పూర్తి అయ్యే అవకాశం ఉందని,
మొత్తం పూర్తి కావాలంటే మరో 12కోట్ల రూపాయలు అవసరం ఉంది..
ఆ నిధులను కూడా వీలైనంత త్వరగా తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో ఆటోనగరుని అభివృద్ధి చేస్తాం....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఈ ఆటోనగరులో రోడ్లు,డ్రైన్లు,కల్వర్టులు సమస్య ఉందని చెప్పిన వెంటనే వేగవంతంగా స్పందించిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గ మరియు ఆటోనగర్ వాసుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నా....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి