అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

 నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండలంలోని మల్లికార్జునపురం, ఈదూరు, మండపం, వరకావిపూడి, మాచర్లవారిపాళెం గ్రామాలకు చెందిన





అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.


స్క్రోలింగ్ పాయింట్స్:


👉 మనిషి జీవితంలో, తినడానికి తిండి, కట్టుకునేందుకు బట్ట, తర్వాత ఉండటానికి ఇంటి గురించి ఆలోచన చేస్తాడు.


👉 ప్రతి ఒక్కరూ కోరుకునే సొంతింటి కలను ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నిజం కావడానికి సాధ్యమైంది.


👉 మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, భూములు కొనుగోలు చేసి, లేఅవుట్లు అభివృద్ధి చేసి, ప్లాట్లు కేటాయించి, ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడుతున్నారు.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలో 18వేల కుటుంబాలకి ఇళ్ల పట్టాలు అందజేయడం సంతోషంగా ఉంది.


👉 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కొనసాగుతుంటే, తెలుగుదేశం వాళ్లు భరించలేక, కోర్టుల ద్వారా అడ్డుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.


👉 తెలుగుదేశం నాయకులు అరిచి గీ పెట్టినా, పట్టాల పంపిణీని ఎన్ని విధాలా అడ్డుకోవడానికి చూసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం తప్ప, పట్టాల పంపిణీని ఎవ్వరూ అడ్డుకోలేరు.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టా అందించే బాధ్యత నాది.


👉 సర్వేపల్లిలో సోమిరెడ్డి పెత్తనం నిలబెట్టినప్పుడు గ్రామాల్లో పర్యటిస్తే, రెండు ఇళ్లు తగలపడాల్సిందే!, నలుగురు గ్రామస్తులకు తల పగిలి కుట్లు పడాల్సిందే!.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో మాదిరిగా ఉద్రిక్తతలకు తావు ఇవ్వకుండా, గ్రామాల్లో ప్రజలు శాంతియుతంగా ఉండేందుకు సహకరిస్తున్నాం.


👉 సోమిరెడ్డి ధ్యాస అంతా అక్రమ సంపాదనే లక్ష్యంగా, అవినీతే ధ్యేయంగా పని చేసి అభివృద్ధి గురించి పట్టించుకోలేదు.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా, ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున అమలు చేస్తున్నాం.


👉 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం సుమారు 200 కోట్ల రూపాయలతో సిమెంటు రోడ్లు, సైడు డ్రైన్లు నిర్మించడంతో పాటు, ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి, పరిశుభ్రమైన తాగునీరు అందిస్తాం.


👉 సోమిరెడ్డి దత్తత తీసుకున్న మల్లికార్జునపురం గ్రామంలో అభివృద్ధి నోచుకోని సందర్భంలో 75 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నాం.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు అవకాశం కల్పించిన నా కుటుంబ సభ్యులైన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇంటి బిడ్డగా సేవలందిస్తా.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget