రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిసిన పేర్నాటి
💠 తోళ్ల శుద్ధి కర్మాగారం ను రద్దు చేయాలని మంత్రికి వినతిపత్రం
💠 తోళ్ల శుద్ధి పరిశ్రమ తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలను ఏర్పాటు చేయండి
💠 తోళ్ల పరిశ్రమ కు వ్యతిరేకంగా 10 ఏళ్ళు పోరాటం చేసాం
💠 ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమాలకు సిద్ధం
💠 తోళ్ల శుద్ధి పరిశ్రమను ఏర్పాటును రద్దు చేస్తాం- మంత్రి గౌతమ్ రెడ్డి
💠ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం
💠 మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడి
నెల్లూరు : కోట మండలం లోని తీరప్రాంత గ్రామాలు కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని వావిళ్ళ దొరువు గ్రామ సమీపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోళ్ల శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు మేము పూర్తి వ్యతిరేకం అనీ అవసరం అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి తెలియజేసి తోళ్ల శుద్ధి పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అనీ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు,
గురువారం నెల్లూరు లోని మంత్రి గౌతమ్ కుమార్ రెడ్డి అతిథి గృహంలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఉప్పల ప్రభాకర్ గౌడ్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి తోళ్ల శుద్ధి పరిశ్రమను రద్దు చేసి ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిశ్రమను ఏర్పాటు చేసి తీరప్రాంత ప్రజలకు,యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనీ వినతిపత్రం అందజేసీ కోరారు, వెంటనే స్పందించిన మంత్రి గౌతమ్ రెడ్డి తోళ్ల శుద్ధి కర్మాగారం ను రద్దు చేసి పొల్యూషన్ లేని ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిశ్రమ ను ఏర్పాటు చేస్తాం అనీ పేర్నాటి కి హామీ ఇచ్చారు,
ఇప్పుడు తోళ్ల శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అనీ, అందువలన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అన్నీ విషయాలు క్షుణ్ణంగా వివరించాం అనీ, ఆయనకూడాసానుకూలంగా స్పందించి తోళ్ల శుద్ధి పరిశ్రమ ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అని తెలిపారు,
గత కాంగ్రెస్ ప్రభుత్వం లో పునాదులు పడ్డ తోళ్ల శుద్ధి పరిశ్రమకు వ్యతిరేకంగా 10 ఏళ్ల పాటు ప్రజల పక్షాన నిలబడి సుదీర్ఘ పోరాటాలు చేశాం అనీ తెలిపారు, గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆనాడు వైసీపీ అధికారంలోకి వస్తే తోళ్ల శుద్ధి పరిశ్రమ ను రద్దు చేస్తాం అని హామీ ఇచ్చారు అనీ ఈ సందర్భంగా పేర్నాటి గుర్తు చేశారు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ కుమార్ రెడ్డి కూడా తీరప్రాంత ప్రజల సమస్యలను అర్ధం చేసుకుని తోళ్ల శుద్ధి పరిశ్రమను రద్దు చేస్తాం అని హామీ ఇచ్చారు అని ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు.
ప్రాణాలు అర్పించి తోళ్ల శుద్ధి పరిశ్రమను అడ్డుకుంటాం
అత్యంత ప్రమాదకరమైన తోళ్ల శుద్ధి పరిశ్రమను అడ్డుకొనేందు ఎంతటి పోరాటాలకు అయినా సిద్ధం అనీ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు, అవసరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసి తోళ్ల శుద్ధి పరిశ్రమ కు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం అన్నారు, ఒక్కసారి తోళ్ల పరిశ్రమ ఏర్పాటు అయితే తీరప్రాంత ల్లో ఉన్న మత్స్యకారులు రోగాలు బారిన పడి జీవనోపాధి కోల్పోయి వీధిన పడే అవకాశాలు ఉన్నాయి అన్నారు, పరిశ్రమ వలన భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని, పచ్చని పల్లెలు నాశనం అవుతాయి అనీ తెలిపారు,తనకు అధికారం ముఖ్యం కాదు అని ప్రజల సంక్షేమం ముఖ్యం అన్నారు.
Post a Comment