నారాయణ మెడికల్ కళాశాలలో డ్రై రన్ జరుగుతున్న ఎమర్జెన్సీ వార్డులోని సెషన్ సైట్ ని సందర్శించిన కలెక్టర్..,

  నెల్లూరు జిల్లాలో శనివారం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం  ముందస్తు సన్నద్దతలో భాగంగా  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు.., వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతున్న నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కళాశాల, క్రాంతి నగర్ పి.హెచ్.సి. ని సందర్శించి.., అక్కడి జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రై రన్ ని పర్యవేక్షించారు. మొదట




















నారాయణ మెడికల్ కళాశాలలో డ్రై రన్ జరుగుతున్న ఎమర్జెన్సీ వార్డులోని సెషన్ సైట్ ని సందర్శించిన కలెక్టర్.., ఎంట్రీ పాయింట్ లోని కోవిడ్ వ్యాక్సినేషన్ అధికారిని తాను నిర్వహించిన విధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ కి వచ్చిన ప్రజల వివరాలు, తమవద్ద ఉన్న చెక్ లిస్ట్ లోని వివరాలతో సరిపోయాయో..? లేదో..? జాగ్రత్తగా పరిశీలించాలని.., వారి గుర్తింపు కార్డును చెక్ చేసిన తర్వాతనే.. వెయిటింగ్ రూం లోకి పంపించాలని తెలిపారు. అనంతరం వెయిటింగ్ రూంని సందర్శించిన కలెక్టర్.., వ్యాక్సినేషన్ కోసం వచ్చిన వారికి వెయిటింగ్ రూం లోని వ్యాక్సినేషన్ అధికారులు.., వ్యాక్సినేషన్ కార్యక్రమం పై అవగాహన కల్పించి, వారి సందేహాలు నివృత్తిచేసి మానసికంగా వారు వ్యాక్సిన్ తీసుకోవడానికి సన్నద్ధం చేయాలన్నారు. అనంతరం వ్యాక్సినేషన్ డ్రై రన్ కార్యక్రమానికి వచ్చిన వాలంటీర్లతో కలెక్టర్ మాట్లాడారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రావాల్సిన సమయం, తేదీ, సెషన్ సైట్ అడ్రస్ వివరాలతో వాలంటీర్ల మొబైల్ ఫోన్స్ కి అధికారులు పంపించిన మెసేజ్ ని పరిశీలించారు. వ్యాక్సినేషన్ కోసం నారాయణ ఆస్పత్రి యాజమాన్యం, అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు. వ్యాక్సినేషన్ రూం పక్కనే.., వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిని 30 నిమిషాల సేపు ప్రత్యేక గదిలో ఉంచి వైద్యులు వారికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించాలని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకపోతే వారికి సేఫ్ వ్యాక్సినేషన్ జరిగింది అని నిర్ధారించుకుని ఇంటికి పంపించాలని.., ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా? ఎమర్జెన్సీ పరిస్థితి ఎదురైతే ఎమర్జెన్సీ వార్డుకు తరలించాలని.., అక్కడ చికిత్స అందించడానికి ముందస్తుగా వైద్యులను, మెడిసిన్స్ 24 hrs అందుబాటులో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.


అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ జిల్లాలోని 3 సెషన్ సైట్స్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా డ్రై రన్ నిర్వహించామని.., ప్రతి సెషన్ సైట్ లో 30 మందితో మాక్ డ్రిల్ నిర్వహించామని తెలిపారు. సెషన్ సైట్ లోకి వ్యాక్సినేషన్ కోసం వచ్చిన వ్యక్తి వ్యాక్సిన్ తీసుకుని వెళ్ళడానికి 45 ని. సమయం పడుతుంది అని.., ప్రతి వ్యాక్సినేషన్ సైట్ లోనూ విధులు నిర్వహించడానికి 5 వ్యాక్సినేషన్ సిబ్బందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసి.., తగిన శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలోని 665 గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం 665 సెషన్ సైట్స్ సిద్ధం చేస్తున్నామని.., సెషన్ సైట్ లో విధులు నిర్వహించాల్సిన సిబ్బందిని మ్యాపింగ్ కూడా చేశామన్నారు. మొదటిదశలో 32,000 మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఐ.సి.డి.ఎస్, ప్రభుత్వ వైద్యులు, ఎం.బి.బి.ఎస్. విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు, మెడికల్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థినిలకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. రెండో దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన ప్రభుత్వ సిబ్బందికి, మూడో దశలో 50 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు, హోం ఆర్బిటీస్ వారికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఆ తర్వాత వివిధ దశల్లో జిల్లాలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ అందిస్తామని, ఇప్పటికే కోవిడ్ వచ్చి చికిత్స తీసుకుని నెగటివ్ వచ్చిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్ తీసుకునే వారి ఆధార్ , ఫోన్ నెంబర్, ఇతర వివరాలు సేకరిస్తున్నామని.., వారికి ముందుస్తుగానే ఎక్కడ సెషన్ సైట్ ఉంటుంది, ఏ సమయంలో వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు అనేది 24 గం. ముందే సమాచారం మెసేజ్ రూపంలో ఫోన్ కి పంపిస్తామన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, వైద్య శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ.., ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారని.., కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు రాగానే జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. వ్యాక్సినేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.


ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి,

 డి.ఎం.హెచ్.ఓ శ్రీమతి రాజ్యలక్ష్మి, ఆర్.డి.ఓ శ్రీ హుస్సేన్ సాహెబ్, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget