నెల్లూరు జిల్లాలో రేషన్ సరుకుల డెలివరీకి సంబంధించి జిల్లాకు చేరుకున్న ప్రత్యేక వాహనాల రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని
జాయింట్ కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు. నెల్లూరు ఏసీ స్టేడియంలో వీటిని జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి నిత్యావసర వస్తువుల డోర్ డెలివరీ జరగనుందన్నారు..అందుకు సంబంధించి జిల్లాకు 524 ప్రత్యేక వాహనాలు కేటాయించారని ఇప్పటికే సగానికిపైగా ప్రత్యేక వాహనాలు జిల్లాలు చేరుకున్నాయన్నారు.. వీటిని షోరూమ్ యజమానులు ఆర్టీఏ అధికారులు త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేయించి ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు అందించాలన్నారు.. ప్రత్యేక వాహనాలకు సంబంధించిన ఎస్సీలకు 151, బీసీలకు 222 ,ఎస్టీలకు 75, మైనార్టీలకు 43, క్రిస్టియన్లకు 4 వాహనాలు కేటాయించామన్నారు... ఈ సందర్భంగా వాహనాల సామర్ధ్యం కూడా పరిశీలించారు ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ కృష్ణారావు ,ఐటిడిఎ మణికుమార్ , ఎస్ సి కార్పొరేషన్ ఈడి మధుసూదన్,మైనార్టీ కార్పొరేషన్ ఈడీ నారాయణ, నెల్లూరు ఆర్టీవో సుశీల పాల్గొన్నారు
Post a Comment