"సర్వేపల్లిలో అట్టహాసంగా రెండో విడత అమ్మఒడి కార్యక్రమం."
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో పొదలకూరు మండల కేంద్రంలో నిర్వహించిన రెండో విడత "అమ్మ ఒడి" కార్యక్రమంలో పాల్గొని 34 కోట్ల 66 లక్షల 80 వేల చెక్కును విద్యార్థులు, తల్లుల సమక్షంలో ప్రదర్శించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
ఆట పాటలతో ఆలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు.
ట్రిపుల్ ఐటీలో ప్రతిభ కనబరచి, అడ్మిషన్లు సంపాదించిన విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 సృష్టిలో అమ్మ ఒడి మాధుర్యాన్ని అనుభవించని బిడ్డ ఉండదు.
👉 బిడ్డలకు వయసు వచ్చేకొద్ది స్కూళ్లకు వెళ్లడం ప్రారంభించిన తర్వాత క్రమేపీ అమ్మ ఒడికి దూరమవుతారు.
👉 స్కూళ్లకు వెళ్లే బిడ్డలకు కూడా అమ్మఒడి మాధుర్యాన్ని కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు.
👉 భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో రెండో విడత అమ్మఒడి పథకం కింద 23,112 తల్లుల ఖాతాల్లో 34 కోట్ల 66 లక్షల 80వేల రూపాయల నిధులు జమ చేశారు.
👉 "జగనన్న అమ్మ ఒడి" ద్వారా ఆర్ధిక సహాయం, "నాడు - నేడు" పేరిట పాఠశాలల అభివృద్ధి, "జగనన్న విద్యా కానుక" కిట్లు, "జగనన్న గోరుముద్ద" పేరిట పోషకాహారం అందజేత లాంటి కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అమ్మ ఒడి పథకాన్ని విజయవంతంగా అందించడానికి సహకరించిన మండల విద్యా శాఖ అధికారులకు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, అధ్యాపకులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు.
Post a Comment