నెల్లూరు జీజీ హెచ్ ఐసీయూలో ఉన్న వారిని పరామర్శిస్తున్న రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి...
*నెల్లూరు జీజీ హెచ్ ఐసీయూలో ఉన్న వారిని పరామర్శిస్తున్న రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి... పూర్తిస్థాయిలో వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు... వారి ఆహారం లేదా తాగునీటిలో ఏమైనా కెమికల్ ఏమైనా కలిసిందా లేదా అనే విషయాలను ఆయన ఆరా తీస్తున్నారు... పరీక్ష ఫలితాలు వస్తేనే సమగ్ర వివరాలు వెల్లడిస్తామని ఈ సందర్భంగా డాక్టర్లు పేర్కొన్నారు... డాక్టర్ శోభారాణి ( డీఏపీ ) , హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ కు మేకపాటి ప్రశ్నల వర్షం కురిపించారు... చాలా మంది బాధితులకు సంబంధించిన కేస్ షీట్లను ఆయన స్వయంగా పరిశీలించారు ప్రతి బాధితుణ్ణి ప్రత్యేకంగా చూసుకునేందుకు ఒక డాక్టర్ ను కేటాయించాలని మేకపాటి సూచించారు... ఆర్ఎంఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం , ఆర్ఎంఓ డాక్టర్ అరుణ్ కాంత్ , నోడల్ అధికారి డాక్టర్ మస్తాన్ భాష , ఆర్ ఎం ఓ డాక్టర్ స్వరూప రెడ్డి తదితరులకు మంత్రి మేకపాటి కొన్ని సూచనలు జారీ చేశారు..*.. అలాగే జాయింట్ కలెక్టర్ హరేందిరా ప్రసాద్ కు కూడా సూచనలు జారీ చేశారు
Post a Comment