పొదలకూరు మండలంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటన..
ఆత్మీయ పలకరింపులు, ఆప్తులను కోల్పోయిన వారికి పరామర్శలతో పొదలకూరు, బిరదవోలు, మొగళ్లూరు, అమ్మవారిపాళెం, నావూరుపల్లి, నావూరు, తాటిపర్తి, యర్రబల్లిలో సాగిన పర్యటన
సోమిరెడ్డి కామెంట్స్
మీరు పుట్టిన, మీకు పదవులిచ్చిన పొదలకూరు ప్రాంతాన్ని 30 ఏళ్లుగా బీడు పెట్టుకుంటే మేం వచ్చి అభివృద్ధి చేసి ఒక రూపు తెచ్చాం..
కాంగ్రెస్, వైసీపీకి మెజార్టీ ఇస్తున్న ప్రజలు కూడా ఒక్క సారి మంచి మనస్సుతో ఆలోచించాలి..పొదలకూరు మండల అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో గుర్తించాలి..
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ఏడీబీ, ప్రపంచ బ్యాంకు, నాబార్డు నిధులు కోట్లకు కోట్లు తెచ్చి పల్లెలకు రోడ్లు వేయించాం..చెరువుల పనులు చేయించాం..చెక్ డ్యాంలు నిర్మించాం..
పి.హెచ్.సీ స్థాయిని పెంచి రూ.4 కోట్లతో సకల వసతులు కలిగిన 30 బెడ్ల ఆస్పత్రి కట్టాం..అత్యాధునిక కంటి వైద్య విభాగాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చాం..
30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న దక్షిణ కాలువ పనులను రూ.7 కోట్లతో చేపట్టి పొదలకూరు మండలానికి సోమశిల జలాలు తెచ్చాం..కొనసాగుతున్న పనులను ఈ ప్రభుత్వం వచ్చాక నిలిపేశారు..
పెద్ద మండలమైన పొదలకూరులో ప్రారంభించిన మినరల్ వాటర్ ప్లాంటును మూలన పెట్టేశారు..
తోడేరు పెద్దరెడ్లు మాత్రమే తాగాల్సిన మినరల్ వాటర్ పేదోళ్లు, సామాన్యులు కూడా తాగుతారా...అని కోపమొచ్చినట్టుంది..
తాగునీరు కలుషితమై కలువాయి మండలం వెరుబొట్లపల్లిలో బెంగాల్ కూలీలు 50 మంది ఆస్పత్రి పాలై ఒకరు చనిపోవడం..ఏలూరులో వందల మంది ఆస్పత్రుల పాలవడం చూశాం..
పొదలకూరు మండల ప్రజలు మంచి నీళ్లు తాగాలని ప్రభుత్వమే నిర్వహించే మినరల్ వాటర్ ప్లాంటును అప్పటి మంత్రి లోకేష్ బాబును ఒప్పించి తెస్తే ఆపడానికి మనస్సు ఎలా వచ్చిందయ్యా..
అన్న క్యాంటీన్ మూసేసి పేదల నోటి కాడి కూడు తీసేశారు..
కండలేరు ఎడమ కాలువ కూడా ఎన్టీఆర్ పుణ్యమే..దానికి లిఫ్ట్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మేం తెచ్చాం..
రూ.62 కోట్లతో తెచ్చిన లిఫ్ట్ తో రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు నీళ్లిచ్చాం..
రైతులు తరుముతారని గమ్ముగున్నారు కానీ లేదంటే లిఫ్ట్ ను కూడా నిలిపేసుండేవాళ్లు...
జరుగుతున్న పనులను నిలిపేయడం తప్ప..మీరు చేసిందేమిటి..
జిల్లాకు ఒక మండలానికి రూర్బన్ లో అవకాశం వస్తే ..వెంకయ్య నాయుడు గారి పుట్టిల్లు వెంకటాచలంకు తెచ్చి కోట్లాది రూపాయలతో పనులు చేశాం..
ఈ రోజు మీరు ఆర్భాటంగా రూర్బన్ పథకానికి భారీ శిలాఫలకం వేసుకున్నారు..సంతోషం
రాష్ట్రమంతా అమలవుతున్న రొటీన్ పథకాలు తప్ప ప్రత్యేకంగా సర్వేపల్లి నియోజకవర్గానికి ఏం సాధించారో ప్రజలకు చెప్పి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఓట్లు అడగండి..
టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన రోడ్లకు బిల్లులిస్తున్నాం అంటున్నారు..మీరు ఇస్తున్నది మీ సొంత డబ్బులేం కాదు..అవన్నీ ఏడీబీ, ప్రపంచ బ్యాంకు గ్రాంట్లు..
కొత్త పథకం ఏం తెద్దాం అని ఆలోచన ఉండాలి కానీ మినరల్ వాటర్ స్కీం ఆపేస్తాం..దక్షిణ కాలువ పనులు ఆపేస్తాం..అన్న క్యాంటీన్ ఆపేస్తామనడం తగదు..
పైన దేవుడు అన్నీ చూస్తున్నాడు..ప్రజలు ఇప్పటికైనా ఆలోచిస్తారని మాకు నమ్మకం ఉంది..
Post a Comment