విధ్యుత్ అధికారుల నిర్లక్ష్యం
💥విద్యుత్ షాక్ తో నిండు ప్రాణం బలి
💥 మొన్న బాలయపల్లి, నిన్న చిట్టమూరు,నేడు ఓజిలి
ఇటీవల కాలంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు గాలిలో కలసి పోతున్నాయి,మొన్న బాలయపల్లి నిన్న చిట్టమూరు సంఘటనలు మరువక ముందే ఓజిలి లో మరో నిండు ప్రాణం గాలి లో కలిసి పోయింది,
ఓజిలి మండలం లోని గుర్రంకొండ గ్రామమం లో గురువారం విధ్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైన సంఘటన చోటుచేసుకొంది. వివరాలలోకి వెళ్ళితే మండల పరిధిలోని గుర్రంకొండ గ్రామానికి చెందిన కనుపూరు. రమణయ్య (35) అనే వ్యక్తి గురువారం గుర్రంకొండ గ్రామానికి చెందిన మందా. పాండురంగయ్య అనే భూయజమానికి సంబంధించిన పొలంలో ని పైరుకు స్ప్రే చేస్తుండగా విధ్యుత్ షాకుకు గురై సంఘటనా స్థలంలో మృతి చెందాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే భూ యజమాని విధ్యుత్ లైన్లు ఏర్పాటు చేసివున్న విధ్యుత్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకొందని మృతుని బంధువులు బోరున విలపించారు. విధ్యుత్ లైన్ కు జాయింట్ వుండడంవల్లే ఈ సంఘటన చోటుచేసుకొందని గ్రామస్థులు తెలిపారు. నిర్లక్ష్యం వహించిన భూ యజమానితో పాటు, సంబంధిత విధ్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతుని భార్య ధనమ్మ, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం తెలుసుకొన్న ఎసై శేఖరబాబు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పంచనామా నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దరాప్తు చేస్తున్నారు.
Post a Comment