నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ చార్జి నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు
సోమిరెడ్డి కామెంట్స్
వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాధారణ పాలన కూడా కరువైంది...
నిత్యావసర సరుకులు, ఇసుక, లిక్కర్ ధరల నుంచి కరెంట్ చార్జీల వరకు అన్ని పెరిగిపోయాయి...
అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు గొంతెత్తితే సస్పెండ్ చేసి బయటకు నెట్టేస్తున్నారు..ఇది ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం తీరు..
నివర్ తుపాన్ ప్రభావంతో జిల్లా రైతులు మరోసారి నష్టాలబారిన పడ్డారు...నారుమడులు దెబ్బతినే రూ.160 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.
ఎడగారు సీజన్ ధాన్యం ధరల విషయంలోనూ భారీగా నష్టపోయారు..మద్దతు ధర పుట్టికి రూ.15,700గా ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో రూ.7 వేల నుంచి రూ.9 వేల లోపే తెగనమ్ముకున్నారు..
వైసీపీ నాయకులు, దళారులు కలిసి తక్కువ ధరలకు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరకు అమ్ముకున్నారు..
రైతులు వందల కోట్లు నష్టపోతే జిల్లా నుంచి ముఖ్యమంత్రి దగ్గరకు పోయి ఆదుకోమని కోరే ప్రజాప్రతినిధులు కరువయ్యారు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ రైతులను ఆదుకుంటూ ముందుకు సాగాం...
వైసీపీ ప్రభుత్వంలో పరిస్థితులు పూర్తిగా తిరగబడ్డాయి..రైతులకు కష్టాలు, సమస్యలు వస్తే పట్టించుకునే నాథులు కరువయ్యారు...
ఈ ఏడాదిన్నరలో ప్రజలు పడిన కష్టాలకు ఫలితం తిరుపతి ఉప ఎన్నికలో చూడబోతున్నాం...
నాయకులందరం ఐక్యంగా పనిచేసి ఉప ఎన్నికలో సత్తా చాటుతాం..తిరుపతి ఎంపీగా పనబాక లక్ష్మిని గెలిపించుకుంటాం...
Post a Comment