ఆంధ్రప్రదేశ్ లో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఎప్పటి నుంచో జపాన్ తో ఆంధ్రప్రదేశ్ కు మంచి అనుబంధం
విశాఖపట్నంలో 10 లక్షల చదరపు అడుగుల్లో 'జపనీస్ ఎన్‌క్లేవ్' నిర్మాణం
చైనా నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే జపాన్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు
పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా 'జపాన్ డెస్క్ ఏర్పాటు'
ఇప్పటికే ఏపీలో కొలువైన ఏటీసీ టైర్స్, యొకొహొమా గ్రూప్ వంటి ప్రఖ్యాత పరిశ్రమలు
ఒక్క వాహనాల టైర్ల తయారీలోనే 2000 మందికి ఉపాధి, యువతకు శిక్షణ అందించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు
శ్రీసిటీలో భారీ స్థాయిలో ఏర్పాటైన జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్
వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC)అభివృద్ధిలో భాగంగా మరో జపాన్ పారిశ్రామిక టౌన్ షిప్ కు ప్రతిపాదన
తొలిసారిగా తీర ప్రాంత కారిడార్ గా ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్ (ECEC)
శ్రీసిటీ పరిసరాల్లో 150 నుంచి 200 జపనీయులు ఉన్నారు
చిత్తూరులో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్
విశాఖలో పదిలక్షల చదరపు అడుగుల్లో జపనీస్ ఎన్‌క్లేవ్ నిర్మాణం
చైనా నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే జపాన్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు
పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా జపాన్ డెస్క్ ఏర్పాటు
ఇప్పటికే రాష్ట్రంలో 25కిపైగా జపాన్ కంపెనీల పెట్టుబడులు
మరిన్ని రంగాలలో జపాన్ పరిశ్రమల నుంచి పెట్టుబడులు ఆకర్షణ కోసం జపాన్-ఇండియా తయారీ సంస్థ(JIM-JAPAN-INDIA INSTITUTE FOR MANFACTURING) ఏర్పాటు
కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు వున్న 2,500 కి.మీ తూర్పు తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌ను మూడు దశల్లో అభివృద్ది చేయాలని కేంద్రం నిర్ణయం. అందులో భాగంగా తొలి దశలో విశాఖ చెన్నై కారిడార్ అభివృద్ధి.
జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజన్సీ నేతృత్వంలో కృష్ణపట్నం కేంద్రంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ , ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (NICDIT) భాగస్వామ్యం ద్వారా చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(CBIC) అభివృద్ధికి 1300 కోట్ల నిధులు
ప్రధాని మోదీ, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో పరిశ్రమలను ఆదుకోవడం కోసం కోవిడ్-19 సమయంలో ఆత్మనిర్భర్ సహా పలు కీలక సంస్కరణలు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిలో జపాన్ పాత్ర ఎంతో కీలకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో జపాన్ కు బలమైన సంబంధాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏడాదిన్నర ప్రభుత్వంతో మరింత అనుబంధం
డీపీఐఐటీ, సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన భాగస్వామ్య సదస్సు-2020లో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
విజయవాడ ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలోని సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి మేకపాటి సమావేశం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జపాన్ భాగస్వామ్య సదస్సుకు హాజరైన కేంద్ర డీపీఐఐటీ శాఖ కార్యదర్శి గురుప్రసాద్ మోహపాతర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ రవీన్, ఈడీ ప్రతాప్ రెడ్డి, జపాన్ కు చెందిన ఎకనమీ, ట్రేడ్, పరిశ్రమల శాఖ (METI) వైస్ మంత్రి సన్ షిగెహిరో టనక, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JETRO) సీఐఐ వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ , జపాన్ భారత అంబాసిడర్ సంజయ్ కె వర్మ, సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ఇతరులు...
Post a Comment