జిల్లాలో నిఘా అధికారుల వైఫల్యం..
మంత్రి అనిల్ కాన్వాయ్ ని అడ్డుకున్న ఏబీవీపీ....సుమారు పది నిమిషాలు ఇస్కాన్ సిటీ ఆర్చి వద్ద రోడ్డుపై నిలిచిపోయిన మంత్రి అనిల్.... రాష్ట్ర క్యాబినెట్ లో కీలక స్థానంలో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్ ని ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారు... మంత్రి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది... రాష్ట్రస్థాయి మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చేటప్పుడు.. రూట్ క్లియర్ చేసి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో వైఫల్యం చెందారు దీంతో మంత్రి అనిల్ పది నిమిషాలు రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది... ఈ సందర్భంగా ఎబివిపి విద్యార్థులతో మంత్రి అనిల్ మాట్లాడుతూ సమస్యల పై మాట్లాడే పద్ధతి ఇది కాదని ఏమైనా ఉంటే కార్యాలయానికి వచ్చి ఇవ్వాలని సూచించారు... నెల్లూరు నగరంలో బలమైన క్యాడర్, పునాదులు ఉన్న మంత్రి అనిల్... కాన్వాయ్ రోడ్డుపై నిలిచిపోవడం నిఘా అధికారుల వైఫల్యంపై మంత్రి అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు... దీనిపై మంత్రి అనిల్ కూడా దీనిని సీరియస్ గా తీసుకున్నారు..
Post a Comment