నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం,
పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై అధికారులతో సమీక్షించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
రైతులకు 80 శాతం సబ్సీడీతో విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
పొదలకూరు పట్టణంలో పావని షాపింగ్ ఆర్కేడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో డిసెంబర్ 25వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
👉జగన్మోహన్ రెడ్డి గారు అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పూర్తి హక్కులు కలిగే విధంగా ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
👉పేదవాళ్లకు ఇచ్చే జానెడు జాగాకు సర్వహక్కులు కల్పించడం వల్ల తెలుగుదేశం వాళ్లకు వచ్చిన ఇబ్బందులు ఏమిటో తెలియడం లేదు!.
👉చంద్రబాబు, తెలుగుదేశం వాళ్ళు పేదలకు ఇచ్చే ఇళ్ళ స్థలాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు.
👉పేదలు బాగుపడుతుంటే తెలుగుదేశం వాళ్లు తట్టుకోలేక, బాధపడుతున్నారు.
👉 ఎవరు అడ్డుకోవాలని చూసినా పేదలకు డిసెంబర్ 25వ తేదీన ఇళ్ళ స్థలాల పంపిణీ చేపడుతాం.
👉 తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి అవినీతి పుణ్యమా అని సాగునీటిని తరలించే లిఫ్ట్ వైఫల్యం చెందింది.
👉తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు ఎంత పంట పండించారో చెప్పే ధైర్యం ఉందా!
👉వైయస్సార్ ప్రభుత్వంలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సాగు నీటిని పంపిణీ చేయడంతో, రైతులు పంటలు పండిస్తున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికి తాగు నీరు అందించే జల జీవన్ మిషన్ పథకానికి 30 కోట్లతో శ్రీకారం చుట్టి మంత్రులచే శంఖుస్థాపన చేయించడం జరిగింది.
👉మంత్రిగా సోమిరెడ్డి తాగు నీటి కోసం ఏవేవో ఏర్పాటు చేస్తానని మభ్య పెట్టడం తప్ప, ఏ ఒక్కటి చేయని పరిస్థితి.
👉మంత్రిగా పెత్తనం వెలగబెట్టినా, అవినీతి సంపాదన పై ధ్యాస తప్ప, సోమశిల దక్షిణ కాలువకు కనీసం అటవీశాఖ అనుమతులు తీసుకొని రాలేని పరిస్థితి.
👉 గ్రామాల్లో అభివృద్ధి జరగకుండా, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన పరిస్థితి.
👉తెలుగుదేశం ప్రభుత్వంలో రూ-అర్బన్ పధకం క్రింద కోట్లాది రూపాయలు దోచుకోవడం తప్ప, అభివృద్ధి జరగలేదు.
👉రూ-అర్బన్ పధకం కింద గతంలో మాదిరిగా కాకుండా, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాం.
👉తెలుగుదేశం నాయకులు పేదల ఇళ్ల స్థలాలు అడ్డుకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.
👉సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అన్ని వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నాం.
👉తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల ఆదుకుంటున్నారు.
👉గతంలో మంత్రులుగా పనిచేసినవారు మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి, నీరు-చెట్టు, రైతు రధం పేరిట రైతులను అడ్డుపెట్టుకొని అన్ని విధాలా దోచుకున్నారు.
👉గతంలో వ్యవసాయ శాఖ మంత్రి గా ఉన్న వ్యక్తి రైతులకు ఏమి ఒరగబెట్టాడో చెప్పే ధైర్యం ఉందా!
👉మా ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటూ, చేయూతనివ్వడం జరుగుతుంది.
👉చంద్రబాబు రైతుల గురించి ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు.
👉గత చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఇవ్వని ఇన్ ఫుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు.
👉రైతాంగానికి సంబంధించి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది.
Post a Comment