నాయుడుపేట స్వర్ణముఖి నది బ్రిడ్జిని ఆధునీకరణ చేయవలెను.
అధికారుల నిర్లక్ష్యంతో పోతున్న ప్రజల ప్రాణాలు.ఇంకా మరికొన్ని టీమ్లను ఏర్పాటుచేసి బాలిక ఆచూకీ కోసం ప్రయత్నించాలి. తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి.నాయుడుపేట లో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం. అలాగే నీటి ప్రవాహంలో తొమ్మిది సంవత్సరాల పాప నడిలో పడి పోవడం, ఇంతవరకు పాప ఆచూకీ కనిపించకపోవడం చాలా బాధాకరం అన్నారు.ఇప్పటివరకు చేస్తున్న ముమ్మర చర్యలో సరిపోక పాప ఆచూకీ కనిపించలేదని జిల్లా అధ్యక్షులు ఆరోపించారు ఏదోసహాయక చర్యలు చేయాలనే తపనతోనే చేస్తున్నార తప్ప పాప ఆచూకీ కోసం కనుగొనేందుకు ఏమాత్రం వీరు కృషి కనిపించకపోవడం దారుణమని వారు ఆరోపించారు.అలాగే ఈ ప్రమాదం జరగడానికి గల ముఖ్య కారణాలు బ్రిడ్జి ఇరువైపులా లైట్ లేని కారణంగా బ్రిడ్జ్ వంతెనపై రక్షణ గోడలు లేని కారణంగా తరచుగా ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పారు. తక్షణమే ఈ బ్రిడ్జి పై మరమ్మతులు చూపించి బ్రిడ్జికి ఇరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి,రక్షణ గోడలు కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని వారు డిమాండ్ చేశారు. అలాగే నది లో చెత్త చెదారం ఉండడం వల్ల నీటి ప్రవాహం ఒక్క దగ్గర ఒక్క లాగా ఇంకో దగ్గర ఇంకో లాగా ఉండడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నది మొత్తం నీటి ప్రవాహం ఒకే లా ఉండివుంటే ఇంత దారుణమైన సంఘటన జరిగి ఉండేది కాదని వారు తెలియజేశారు .
అనంతరం మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్లి వెంటనే బ్రిడ్జి పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అలాగే ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలని అలాగే నది లో ఉన్నటువంటి చెత్తాచెదారం మొత్తం పూర్తిగా తీసివేసి నీటి ప్రవాహం సులభంగా వెళ్లే లాగా చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జంపాల మాలాద్రి నాయుడు, ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు,సీనియర్ నాయకులు సుందర్ రావు, శివ ప్రసాద్ శర్మ, సుబ్రహ్మణ్యం రాజు, రాజశేఖర్ రెడ్డి, యువ మోర్చా నాయకులు కోటేశ్వరరావు,హరికృష్ణ ,గురు ప్రసాద్ ,వేణు, దినకర్, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment