అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ఆయన ముందున్న అతిపెద్ద సవాల్ కరోనాను కట్టడి చేయడమే. కరోనా కట్టడికి ఆయన అధ్యక్ష పదవి చేపట్టే రోజు (జనవరి 20) నుంచే చర్యలు తీసుకోనున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే ముందుగా 'ప్రజల్ని మాస్క్ ధరించమని కోరతానని.... అది కూడా ఎప్పటికీ ధరించమని చెప్పను... కేవలం వందరోజులే ధరించమని చెప్తానని' బైడెన్ అన్నారు. ఇలా చేస్తే కొత్త కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గిపోతాయని మీడియాతో చెప్పారు. బైడెన్ మాస్క్ ధరించమని కోరడం.. ట్రంప్ విధానానికి పూర్తి వ్యతిరేకం కావడం గమనార్హం. అలాగే అత్యంత ప్రముఖ వ్యక్తిగా ఉన్న ఆంటో ఫౌచీని తన బృందంలోనూ.. 'చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా ఉండమని కోరతానని.... ఆయనను కరోనా కట్టడి కోసం పనిచేసే ప్రత్యేక కార్యదళంలోనూ ఉండాలని విజ్ఞప్తి చేస్తానని బైడెన్ అన్నారు. అమెరికాలో ఇప్పటికే 1,41,24,678 కేసులు నమోదవ్వగా... వీరిలో 2,26,148 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ఆయన ముందున్న అతిపెద్ద సవాల్ కరోనాను కట్టడి చేయడమే

Post a Comment