వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచుకోండి
- డీఎస్పీ మల్లికార్జున రావు
ధనార్జనే ధ్యేయంగా ఆహార ఉత్పత్తులను కల్తీ చేస్తూ, వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాట మాడుతున్న వాణిజ్య సంస్థలపై అవగాహన పెంచుకుని
చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ డిఎస్పీ మల్లికార్జున రావు కోరారు.
జాతీయ వినియోగదారుల హక్కుల 35 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని
రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నవాబుపేట లక్ష్మీపురంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో సమావేశాన్ని గురువారం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ హాజరై మాట్లాడారు.
ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టం ప్రకారం ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కల్తీ ఉత్పత్తులను ఎవరైనా తయారుచేసినా,
నిల్వ ఉంచినా, మార్కెట్ లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
వినియోగదారులు తమ హక్కుగా భావించి ప్రభుత్వానికి సహకరించినపుడే కల్తీ ఉత్పత్తుల వినియోగానికి అడ్డుకట్ట వేయగలమని అభిప్రాయపడ్డారు.
కల్తీ ఉత్పత్తులపై సమాచారాన్ని"ఆహార భద్రత, నియంత్రణాధికారి" దృష్టికి తీసుకువస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వినియోగదారుల హక్కుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తిరుపాల్, కార్యదర్శి శేషయ్య,
జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రావు, సభ్యులు నాగిరెడ్డి, కల్పన, షుకుర్ బాషా, పెంచలయ్య, శివాని రెడ్డి, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment