మర్రిపాడు మండల కేంద్రంలోని మర్రిపాడు సెంటర్ నందు
సిపియం నాయకుడు ములి వెంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటన ను వ్యతిరేకిస్తూ అమరావతిలో రైతులు చేస్తున్న పోరాటం బుధవారం నాటికి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. అమరావతి లో రైతులు చేస్తున్న పోరాట దీక్షకు మద్దతుగా అఖిలపక్షం లోని అన్ని పార్టీలు కలిసి గురువారం అమరావతిలో భారీసభనిర్వహించనున్నాయి. ఈ సభకు మద్దతుగా మర్రిపాడు సిపిఐ, సిపిఎం, పార్టీలు మండల కేంద్రంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మద్దతు తెలుపుతూ అమరావతి ని రాజధానిగా ఉంచాలని అంటూ నినాదాలు చేశారు. అంతేకాక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అమరావతి నేరాజధానిస్వాగతిస్తున్నామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సొంత ప్రయోజనాల కోసం రాజధానిని మారుస్తామని చెప్పడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత ఆస్తులను పెంచుకునేదాని కోసమో లేకుంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపులు చర్య వలన 3 రాజధానులను ప్రకటించారని దేశంలో ఎక్కడ మూడు రాజధానులు లేవని కాబట్టి అందరు మొండి పట్టుదల విడి నాడీ అమరావతి రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు మూలి వెంగయ్య , సిపిఐ నాయకులు నారాయణ గ్రామ శాఖ కార్యదర్శి రహంతుల్లా, సిపిఎం సిపిఐ పార్టీ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment