నెల్లూరు ప్రశాంతి నగర్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ముందు వెళుతున్న బైక్ ను తప్పించబోయి ఓ బొలెరో
వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువ తూము ను ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో సుమారు పదిమంది వరకు గాయాలయ్యాయి. అలాగే ముందు వెళ్తున్న మోటర్ బైక్ ను కూడా ఢీకొనడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలైయ్యాయి.. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సిఐ రాములు నాయక్ హుటా హుటిన అక్కడకు చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు
Post a Comment