కోవిడ్ -19 నివారణ వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయండి
.. జిల్లా కలెక్టర్ చక్రధర బాబు
నెల్లూరు జిల్లాలో కోవిడ్ -19 నివారణ కు సంబంధించి వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలు, వ్యాక్సిన్ ఇవ్వటానికి కావలసిన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కే.వి.ఎన్. చక్రధర్ బాబు జిల్లా వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు.సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటి అధికారులతో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. తొలుత ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ , డాక్టర్ .శ్రీనాథ్ రామమూర్తి , కోల్డ్ చైన్ ఆఫీసర్ నరేష్ కోవిడ్ వ్యాక్సిన్ గురించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వార టాస్క్ ఫోర్స్ అదికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో కోవిడ్ -19 వ్యాక్సిన్ రానున్నందున జిల్లాలో వ్యాక్సిన్ నిల్వ చేయుటకు వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలు సిద్దం చేయాలన్నారు. జిల్లాలో మొదటి దశలో 23,547 మందికి వ్యాక్సిన్ ఇవ్వవలసినందున అందుకు సంబందించిన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ కోల్డ్ చైన్ పాయింట్ నుండి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు, అక్కడ నుండి వ్యాక్సినేషన్ పాయింట్ కు చేర్చటానికి సంబందించిన ఏర్పాట్లు పూర్తి చెయలన్నారు. వ్యాక్సిన్ ఇవ్వటానికి సంబందించిన డేటాను చెక్ చేసుకోవాలన్నారు. రూట్ మ్యాప్ , మాన్ ప్లాన్ ఉండాలన్నారు . జనవరి 15 నాటికి జాబితా సిద్దం చేయాలన్నారు.ఇందుకు గాలి వెలుతురు ధారాళంగా ఉండే వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్స్ , గ్రామ సచివాలయ భవనాలు, స్కూల్ బిల్డింగ్స్ ఉపయోగించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ఇచ్చేవారికి ఇప్పటి నుండే తగు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ డాక్టర్ .ప్రభాకర్ రెడ్డి, రెవిన్యూ డివిసినల్ అధికారి హుస్సేన్ సాహెబ్ , జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ .రాజ్యలక్ష్మి, జిల్లా టాస్క్ ఫోర్స్ అదికారులు పాల్గొన్నారు*
Post a Comment