మహిళల రక్షణ కోసం అభయ్ ప్రాజెక్టును ప్రారంభం
తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం అభయ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం... దేశంలోనే తొలిసారిగా దిశా బిల్లును ప్రవేశపెట్టి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. ప్రతి జిల్లాలో దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, దిశా యాప్ ద్వారా అక్కా,చెల్లెమ్మలకు అండగా ప్రభుత్వం నిలుస్తోందన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో అభయ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఆటోలు, క్యాబ్‌లో అభయ్ యాప్ డివైజ్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనివలన ఆపదలో ఉన్న మహిళలకు పానిక్ బటన్ నొక్కితే పోలీసులు, అధికారులు వచ్చి వారికి రక్షణ కల్పిస్తారన్నారు.
నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సి నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., మహిళల భద్రత కోసం సోమవారం అభయ్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారన్నారు. ఆటోలు, క్యాబులు, ఇతర ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా సమస్య ఎదురైతే అభయ్ యాప్ ద్వారా పోలీస్, ఫైర్ సిబ్బంది, అధికారుల సహాయం పొందవచ్చన్నారు. ఆటోలు, ప్రజా రవాణా వాహనాల్లో ఐవోటీ బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. 24 గంటలూ మహిళలకు భద్రత కల్పించడానికి ఈ అభయ్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆపదలో ఉన్నప్పుడు వారు ఉన్న లొకేషన్ కూడా పోలీసులకు అందించవచ్చన్నారు. కళాశాలకు వెళ్లే యవతులకు, చిన్న పిల్లలకు ఈ యాప్ ద్వారా రక్షణ కల్పించవచ్చన్నారు. ఈ యాప్ ని మహిళలు అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని, ఏదైనా ఆపద ఎదురతై పోలీసు సిబ్బందిని, అధికారులను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.
Post a Comment