ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయండి
లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించండి
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
- వైసీపీ ఇన్ చార్జ్ లు రాత్రికి ప్రజల దగ్గరే ఉండాలి
- మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నివర్ తుఫాన్ ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో ఎటువంటి ప్రాణ ,ఆస్తి నష్టాలు సంభవించ కుండా జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు... ఎటువంటి అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని రాత్రంతా తాను అందుబాటులో ఉంటానని ప్రకటించారు... విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఇరిగేషన్ అధికారులతో అట్టహాసంగా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల డ్యామ్ లో ఉన్న నీటి నిల్వలను అడిగి తెలుసుకున్నారు... సోమశిల జలాశయం నుంచి పెన్నానదిలో కి లక్ష 16 వేల క్యూసెక్యులను పైగా నీటిని విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే తుఫాను పునరావాస కేంద్రాలకు తరలించారు అని మంత్రి ఆదేశించారు ఇందుకు సంబంధించి నెల్లూరు నగరంలో మరిన్ని పునరా వాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.జిల్లా అధికార యంత్రాంగం తో పాటు నెల్లూరులో వైఎస్సార్సీపీ ఇంఛార్జి లందరు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.... అధికారులకు వైసీపీ ఇన్ చార్జ్ లకు ఎటువంటి అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని సూచించారు..రేపు కేబినెట్ సమావేశం ఉందని అందుకనే నెల్లూరుకు రాలేకపోయానని వివరించారు... నెల్లూరు జిల్లా పరిస్థితి పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అందుబాటులోనే ఉన్నానన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన పలు సూచనలు జారీచేశారు... ఎక్కడైనా అత్యవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను వినియోగించుకోవాలన్నారు.. ఈ సమీక్షా సమావేశంలో తెలుగు గంగ చీఫ్ ఇంజనీర్ హరి నారాయణ రెడ్డి సోమశిల ఎస్ఈ కృష్ణా రావు తో పలువురు అధికారులు పాల్గొన్నారు
Post a Comment