విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌పై సీ ప్లేన్ (నీటి విమానం)కు కేంద్రం ప్రతిపాదిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కేవడియా నుంచి అహ్మదాబాద్‌కు ఈ సేవల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ సహా మరో 14 చోట్ల నీటి విమానాశ్రయాలు (వాటర్ ఏరోడ్రోమ్‌లు) ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. లక్షద్వీప్, అండమాన్-నికోబార్, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలోనూ వివిధ మార్గాల్లో నీళ్లపై విమానాలు దిగేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాటర్ ఏరోడ్రోమ్ అంటే ప్రయాణికులు సీ ప్లేన్ ఎక్కడానికి, దిగడానికి అనువుగా నదిలో నిర్మించే కాంక్రీట్ కట్టడం. ఇది నీటిపై ఎయిర్‌పోర్టు వంటిది.
Post a Comment