*🌟 గూడూరు నియోజకవర్గ పర్యటనలో జిల్లా కలెక్టర్*
*🌟 వైఎస్సార్ నవశకం ఇండ్ల స్థలాలు జాబితా పరిశీలన*
*🌟 గ్రామ సచివాలయంలో సిబ్బంది పనితీరుపై జిల్లా కలెక్టర్ అరా. *జిల్లా కలెక్టర్ చక్రధర్* *బాబు,రెవెన్యూశాఖ* *అధికారులు తో కలిసి శుక్రవారం గూడూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటున్నారు, ముందుగా చిల్లకూరు మండలం లింగవరం గ్రామానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ చక్రధర బాబు రాష్ట్ర* *వ్యాప్తంగా డిసెంబర్ 25న అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తున్న నేపథ్యంలో ఆయన గ్రామాలకు చెందిన గ్రామ రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు, గూడూరు డివిజన్ పరిధిలో లబ్ధిదారుల సంఖ్య మొత్తం అడిగి ఆరాతీశారు, అనంతర చెన్నై- బెంగుళూరు కోస్టల్ కారిడార్ భూములకు సంబంధించి గ్రామ పటాన్ని , భూములను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు, అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు.. అలాగే గూడూరు డివిజన్ కు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.*
*సచివాలయంలో సిబ్బంది పనితీరుపై అరా..*
*చిల్లకూరు మండలం మోమిడి గ్రామ సచివాలయంకు చేరుకున్న జిల్లా కలెక్టర్ చక్రధర బాబు సచివాలయం సిబ్బంది పనితీరుపై అక్కడ సమస్యలు పై అరా తీసి పలు రికార్డులను తనిఖీ చేశారు,సచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేయాలని వీటిలో ఎటువంటి వివక్ష ఉండకూడదన్నారు... ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది కి ఆయన పలు సూచనలు జారీ చేశారు.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలన్నారు, ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, చిల్లకూరు, కోట తహశీల్దార్ సత్యవతి,రమాదేవి,రెవెన్యూ అధికారులు, సర్వేర్లు,గ్రామ రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు*
Post a Comment