నాయుడుపేట డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తున్న డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ జి వి ఎస్ ఎస్ నాగలక్ష్మి..



 నాయుడుపేట డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తున్న డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ జి వి  ఎస్ ఎస్ నాగలక్ష్మి.... నివర్ తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో జిల్లా ఉన్నతాధికారులు వివిధ మండలాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు... నాయుడుపేటలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన సహాయ సహకారాలు అందించేందుకు డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్  నాగలక్ష్మి స్థానిక అధికారులకు పలు సూచనలు జారీ చేశారు... నాయుడుపేట డివిజన్లో తుఫాను షెల్టర్లలలో ఉన్న వారికి ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా వారికి తాగునీరు భోజన వసతిని ఎప్పటికప్పుడు సకాలంలో అందించాలని సూచించారు... డివిజన్ పరిధిలో పలు గ్రామాలను పరిశీలించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు... చెరువుల్లో నీటి మట్టం సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget