శ్రీ కామాక్షితాయి అమ్మవారికి బంగారు నగలు సమర్పణ హైదరాబాద్ కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కొలను రాజా రెడ్డి, పూజిత దంపతులు దాతృత్వం 260 గ్రాముల 400 మిల్లి గ్రాముల కలిగిన శివపార్వతులకు ఆకారం లో
నగలు :ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లకు గురువారం దాతలు బంగారు నగలు సమర్పించారు. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కొలను రాజారెడ్డి వారి ధర్మపత్ని శ్రీమతి పూజిత 263 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారు అడ్డిగను శ్రీ కామాక్షితాయి అమ్మవారికి సమర్పించారని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి అర్వ భూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే అమెరికా కాలిఫోర్నియా వాస్తవ్యులు ఏటూరు గోపాల్ రెడ్డి వారి ధర్మపత్ని శ్రీమతి సత్యవతి 95 గ్రాముల 200 మిల్లీ గ్రాములు శివ పార్వతులు కలిగిన బంగారు నగలు శ్రీ కామాక్షితాయి అమ్మవారికి సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, శ్రీవార్ల కళ్యాణోత్సవం జరిపించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి దాతలను శ్రీవార్ల శేష వస్త్రాలతో సత్కరించి, అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, దాత శ్రీ కొలను రాజారెడ్డిలు దేవస్థానం సంబంధించి గతంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ఆలయం సంబంధించి మరిన్ని అభివృద్ధి పనుల నిర్మాణాలు చేపట్టేందుకు దాత అంగీకరించినట్లు ఆయన తెలిపారు.
Post a Comment