నెల్లూరు జిల్లాలో క్లస్టర్లు ఏర్పాటు వల్ల స్వర్ణకారులు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు స్వర్ణకారులు జాయింట్ కలెక్టర్ హరేందిరా ప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఎంతోమంది స్వర్ణకారులు స్వర్ణకార వృత్తిని నమ్ముకుని తమ కుటుంబాలని పోషించుకుంటూ ఉన్నారన్నారు.. ఇప్పుడు కొత్తగా వెంకటరమణ గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్, విక్రమసింహపురి ట్రెడిషనల్ గోల్డ్ ప్లాస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థల వారు క్లస్టర్ పేరుతో కామన్ ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ కామన్ సెంటర్ ఏర్పడితే వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న స్వర్ణకారులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో స్వర్ణకారులు ఆఫీజ్ బాయ్ , షానవాజ్ ఆదిల్ అహ్మద్, రాజా ,రాయుడు జహీర్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment