తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పేర్నాటి*
కొత్త పట్నం పంచాయతీ గ్రామాల్లో పేర్నాటి సుడిగాలి పర్యటన*
తీరప్రాంతలలో బోటు ప్రయాణంలో పేర్నాటి*
*నివర్ బాధిత కుటుంబాలకు అండగ ఉంటాం*
నివర్ నష్టాలు పై అధికారులు అంచనాలు వేయాలి*
నివర్ తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది*
పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయక చర్యలు*
*నివర్ తుఫాను ప్రభావంతో* *కురిసిన వర్షాలకు కోట మండలం లోని తీర ప్రాంతా గ్రామాలు వరదనీటిలో చిక్కుకోవడంతో అక్కడ ప్రజలు* *తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైసీపీ కార్యదర్శి పేర్నాటి శ్యామ్* *ప్రసాద్ రెడ్డి తన పేర్నాటి సైన్యం తో కలిసి కొత్తపట్నం పంచాయతీలోని గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.*
*అదేవిధంగా కొత్త పట్నం పరిధిలోని తీరప్రాంత గ్రామాలకు పడవ ప్రయాణం చేసి బాధిత కుటుంబాలను పరామర్శించారు, ఈ సందర్భంగా పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ*
*కోట మండలం నివర్ తుఫాన్* *కారణంగా కొత్తపట్నం పంచాయతీలోని గ్రామాలు* *వరద నీటిలో చిక్కుకున్నాయి అని వెంటనే సమాచారం తెలుసుకొని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడం జరిగిందని తెలిపారు, వరద* *నీటితో నిండిన ఇళ్లను చూసి చలించి పోయాం అని బాధితులకు పరిహారం అందించేలా ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని కోరుతున్నాం అన్నారు, బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానిక నాయకులకు కూడా సూచించడం జరిగింది అని అన్నారు.*
*ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం అని పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేసేందుకు వెంటనే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.*
*గూడూరు నియోజకవర్గ పరిధిలో నివర్ తుఫాను ప్రభావంతో నష్ట పోయిన రైతులు, ఇళ్లు లు కూలి ఉంటే వారి జాబితా, పంటలు నష్టం అన్ని వివరాలు సంబంధిత అధికారులు సిద్ధ చేయాలి ఆయన కోరారు,గూడూరు నియోజకవర్గ పరిధిలోని సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు దృష్టి కి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాదర్తి రాధాకృష్ణ రెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్, దువ్వూరూ సాయి కృష్ణ రెడ్డి, మధు రెడ్డి, వెంకు రెడ్డి, ఇన్నమాల వెంకటాద్రి, ఉప్పల ప్రభాకర్ గౌడ్, ఉప్పల రఘు, ఉప్పల మణి, టింకర్ రవి,రవిరెడ్డి, వైసీపీ నాయకులు,కార్యకర్తలు, పేర్నాటి సైన్యం తదితరులు ఉన్నారు.*
Post a Comment