ప్రభుత్వంపై ఆధారపడకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న 150 కుటుంబాలకు సంబంధించి దుకాణాలను జెసిబి లు , బుల్ డోజెర్స్ తో కూల దోయడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గు, శరం ఉండాలని నెల్లూరు టిడిపి పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు... ఆటోనగర్లో దుకాణాలు కోల్పోయిన బాధితులు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయడంతో వెంటనే అబ్దుల్ అజీజ్, టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, దళిత సంఘం నేత జన్ని రమణయ్య తదితరులు ఈ ప్రాంతానికి చేరుకొని బాధితులను పరామర్శించారు... ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వైసీపీ పాలన లో మైనార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు... 150 మంది మైనార్టీల దుకాణాలు తొలగించేందుకు ఈ ప్రభుత్వానికి ఎలా మనసు ఒప్పిందని విమర్శించారు... గత ఎన్నికలకు ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీరికి ఏం హామీ ఇచ్చారో.. దాన్ని నిలబెట్టుకోవాలన్నారు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.... జెసిబి లు ధ్వంసం చేయడం వల్ల దుకాణాల్లోనూ స్పేర్ పార్ట్స్ నట్లు బోల్టులు మొత్తం బురదలో పడిపోయాయని.. ఒక్క కుటుంబానికి ఐదు లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు... వీరికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించకుండా ఎక్కడికి వెళ్లాలి అంటూ ఆయన ప్రశ్నించారు... ఏపీఐఐసీ స్థలంలో రెవిన్యూకు ఏం సంబంధమని నెల్లూరు రూరల్ తాహసిల్దార్ ఏవిధంగా వస్తారని ఆయన నిలదీశారు... మైనార్టీల కడుపు కొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోను సహించమని హెచ్చరించారు...
జిల్లా కలెక్టర్ కూడా అధికార పార్టీ చెప్పిందంతా వినకుండా పేద ప్రజల పక్షాన ఉండాలన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించింది కాబట్టే మైనార్టీలపై దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు..
Post a Comment