రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: జగన్
ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. ‘‘గతంలో పిల్లల చదువులు, ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉండేది. గ్రామాల రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాం. వివక్ష, అవినీతికి తావులేకుండా అభివృద్ధే లక్ష్యంగా 17నెలలుగా పాలన సాగుతోంది’’ అని సీఎం జగన్ తెలిపారు.
సహృదయతకు ఆంధ్రప్రదేశ్ మారుపేరు: మోదీ
Post a Comment