పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 10వేలు.. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు 25వేలు నష్టపరిహారం ఇవ్వాలి - కోటంరెడ్డి డిమాండ్
టీడీపీ నేతలు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తుంటే.. వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని నగర ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు.. మంత్రి అనీల్ కు ప్లడ్ మేనేజ్ మెంట్ తెలియకపోవడం వల్లే లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయన్నారు.. మంత్రి అనీల్ అనాలోచిత నిర్ణయాలు, అధికారుల నిర్లక్ష్యం వల్లే వరద నీరు ఇంటిని ముంచెత్తిందన్నారు. నగరంలోని 48,49,50వ డివిజన్ మరియు 53డివిజన్లలో వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండా కోటంరెడ్డి వరద పర్యటించారు. బాధితులతో మాట్లాడారు.. సమయానికి నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్బంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. వరద భాదితులకు 500 రూపాయలు ఆర్దిక సాయం చేస్తామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు.. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 10వేలు, పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు 25వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు..
టీడీపీ కార్యకర్తలు తమ స్వంత నిధులతో వరద భాదితులకు అండగా నిలబడుతుంటే... వైసీపీ నేతలు విషప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.. ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో నగర అధ్యక్షులు దర్మవరం సుబ్బరావు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు
Post a Comment